వెంకీ అక్కడ కింగ్.. గురుతో సత్తా చాటాడు | guru satellite rights sold for fancy price.

Venky guru telivision rights sold out

Venkatesh Guru movie, Guru Movie satellite rights, Venkatesh Movie, Guru Telugu Movie, Venky Guru, Guru rights, Gemini TV Guru Movie, ictory Venkatesh, Guru Movie 2017, Guru Movie Rights

Gemini TV acquires Victory Venkatesh's Guru Movie satellite rights for Fancy Price.

గురు శాటిలైట్ రైట్స్ భారీ రేటుకే...

Posted: 12/29/2016 12:23 PM IST
Venky guru telivision rights sold out

 

టాలీవుడ్ అగ్ర కథానాయకుడిలో ఒకడైన విక్టరీ వెంకటేష్ తన క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదని నిరూపిస్తున్నాడు. 50 వయసులో కూడా వైవిధ్యమైన పాత్రలను, అందుకు తగ్గట్లు ఫిట్ నెస్ ను మెయింటెన్ చేస్తూ వస్తున్నాడు. గురు సినిమా కోసం పడుతున్న కష్టం చూస్తే ఆ విషయం అర్థమైపోతుంది. ఇక షూటింగ్ ముగింపు దశకు చేరుకోవటంతో బిజిసెస్ మీద దృష్టిసారించారు నిర్మాతలు.

తాజాగా అందిన సమాచారం ఏంటంటే... ఈ చిత్ర శాటిలైట్ రైట్స్ వెంకీ కెరీర్ లోనే హయ్యెస్ట్ రేట్ కి(గోపాల గోపాల.. సీతమ్మ వాకిట్లో మల్టీ స్టారర్ గనక లెక్కలోకి రావు) అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది. ఫ్యామిలీ ఆడియన్స్ లో మాంచి క్రేజ్ ఉన్న వెంకీ ఎప్పటికప్పుడు మంచి టీఆర్పీ రేటింగ్స్ రాబడుతుంటాడు. మొన్న యావరేజ్ టాక్ మూటగట్టుకున్న బాబు బంగారం సినిమాకు వచ్చిన రేటింగే అందుకు నిదర్శనం. అందుకే ఫ్యాన్సీ రేట్ పెట్టి మరీ జెమిని ఛానెల్ గురును కొనుగోలు చేసినట్లు సమాచారం.

సుధా కొంగర దర్శకత్వం వహించిన ఈ సినిమాలో వెంకటేశ్ బాక్సర్ గా నటించగా, ఆయన శిష్యురాలి పాత్రను రితికా సింగ్ పోషించింది. ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలనుకున్నప్పటికీ, చిరు, బాలయ్య ల్యాండ్ మార్క్ చిత్రాలతో గట్టి పోటీ ఉండటంతో, జనవరి 26వ తేదీకి వాయిదా వేసుకున్నారు. ఇప్పటికే తమిళ .. హిందీ భాషల్లో విజయాన్ని సాధించడంతో, తెలుగులోను సక్సెస్ ను సాధిస్తుందనే నమ్మకంతో ఉన్నారు మేకర్లు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Venkatesh  Guru Telugu Movie  Satellite rights  Gemini TV  

Other Articles