అలియా, సూర్య సిినిమాలకు ఆ లిస్ట్ లో చోటు | Alia Bhatt and Suriya 24 in IMDb list.

3 alia bhatt films in the top 5 imdb list

IMDb's list of 2016, Alia Bhatt 2016, Alia Bhatt IMDb, IMDb list 2016, IMDb Indian Movies list, top Indian films 2016, Suriya 24 IMDb, Suriya's 24, Alia Bhatt and Suriya in IMDb, Alia Bhatt IMDb

IMDb's list of 2016's top Indian films out. 3 Alia Bhatt films in the top 5 from South Suriya 24 there.

అలియా మూడు సినిమాలు దుమ్ముదులిపాయి

Posted: 12/24/2016 12:44 PM IST
3 alia bhatt films in the top 5 imdb list

బాలీవుడ్ డింపుల్ బ్యూటీ అలియా భట్ మరో అరుదైన ఘనత సాధించింది. మహేష్ భట్ కూతురిగా రాణించి ఎంట్రీ ఆపై వరుసగా హిట్ల మీద హిట్లు అందేసుకుంది. ఇక 2016 గానూ బాలీవుడ్ నుంచి ఓ అరుదైన ఫీట్ ను అలియా తన సొంతం చేసుకుంది. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మూవీ సైట్ ఐఎండీబీ భారత్ తరపున అత్యధిక మంది వెతికిన జాబితాను విడుదల చేసింది. ఇందులో ఈ బికినీ బ్యూటీ నటించిన మూడు చిత్రాలు ఉండటం విశేషం.

ఈ డిసెంబర్ 20 వరకు రిలీజైన చిత్రాలను పరిగణనలోకి అత్యధికులు సెర్చ్ చేసిన జాబితాను ఐఎండీబీ రిలీజ్ చేసింది. వ్యూవర్స్ ఇచ్చిన రేటింగ్స్, తమ పేజీలో దానికి ఉన్న ప్రాధాన్యత, సెర్చింగ్ తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని దీనిని తయారు చేసింది. ఇందులో అలియా నటించిన డియర్ జిందగీ, ఉడ్తా పంజాబ్, కపూర్ అండ్ సన్స్ వరుసగా మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో నిలవటం విశేషం. డియర్ జిందగీ, కపూర్ అండ్ సన్స్ హిట్లుగా నిలవగా, ఉడ్తా పంజాబ్ బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. అయితే అందులో అలియా నటనకు విమర్శల ప్రశంసలు దక్కాయి. ఇప్పటిదాకా ఐఎండీబీ ప్రకటించిన జాబితాలో ఓ హీరో సినిమాలు కూడా రెండుకు మించి ఈ జాబితాలో చోటుదక్కగాపోగా, ఫస్ట్ అలియా మూడు చిత్రాలతో రేర్ రికార్డు తన సొంతం చేసుకుందన్న మాట.

 

ఇక ఈ జాబితాలో అమితాబ్ పింక్ ఫస్ట్ ఫ్లేస్ లో నిలవగా, అక్షయ్ ఎయిర్ లిప్ట్, నీర్జా, ఎంఎస్ ధోనీ, 24 , సలా ఖద్దూస్, ఇర్ఫాన్ ఖాన్ మదారీ చిత్రాలు వరుసగా ఉన్నాయి. సౌత్ తరపున ఈ జాబితాలో చోటుదక్కించుకున్న ఏకైక హీరో సూర్య కావటం విశేషం. కబాలిని కూడా కాదని సూర్య 24 కే ఎక్కువ ఓట్లు పోలయ్యాయి. టైం ట్రావెలింగ్ కాన్సెప్ట్ తో విక్రమ్ కుమార్ తెరకెక్కించిన ఈ స్టైలిష్ చిత్రం మాతృక కోలీవుడ్ లో యావరేజ్ గా నిలిచినప్పటికీ, తెలుగులో మాత్రం హిట్ టాక్ సొంతం చేసుకోవటం కొసమెరుపు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : IMDb 2016 Indian Movies  Suriya 24  Alia Bhatt 3 movies  

Other Articles