అన్నమయ్య డెప్త్ ఇందులో లేదా? | Om Namo Venkatesaya Teaser Review.

Om namo venkatesaya teaser out

Om Namo Venkatesaya teaser, Nagarjuna Akkineni's Om Namo Venkatesaya, Om Namo Venkatesaya Movie, Om Namo Venkatesaya Nagarjuna

Nagarjuna Akkineni's 'Om Namo Venkatesaya' teaser is out.

ఓం నమో వేంకటేశాయ టీజర్ విడుదల

Posted: 12/24/2016 11:27 AM IST
Om namo venkatesaya teaser out

దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు, టాలీవుడ్ మన్మథుడు నాగార్జున వీరిద్దరి కాంబో ఎంతటి కమర్షియల్ చిత్రాలు ఇస్తారో, భక్తి రసం కూడా అదే స్థాయిలో పండించేస్తారు. తాజాగా వీరిద్దరి కాంబినేషన్ లో మరోసారి ఓం నమో వేంకటేశాయతో అదే పని చేయబోతున్నారు. నాగ్ ను భక్తాగ్రేసరుడిగా, హథీరామ్ బాబా అవతారంలోకి మార్చేసి సినిమాను తెరకెక్కించేశాడు. ఇప్పటికే ఫస్ట్ లుక్ లతో సందడి చేసిన ఈ చిత్ర టీజర్ ను కాసేపటి క్రితం రిలీజ్ చేశారు.

సినిమాలోని పాత్రదారులందరినీ పరిచయం చేస్తూ రిలీజ్ చేసిన ఈ టీజర్లో నాగ్ను భక్తుడిగానే కాక.. ధర్మం కోసం ఎవరినైనా ఎదిరించే వ్యక్తిగా చూపించారు. తొలిసారిగా తెలుగు తెర మీద కనిపించిన సౌరభ్ జైన్ వేంకటేశ్వరుని పాత్రలో ఆకట్టుకున్నాడు. జగపతి బాబు, అనుష్క, రావు రమేష్ పాత్రలను ఎలివేట్ చేశాడు. అయితే అన్నమయ్యలో ఉన్నంత డెప్త్ ఇందులో కనిపించడం లేదన్న కామెంట్లు వినిపిస్తున్నాయి.

 

ఏది ఏమైనా దర్శకేంద్రుడి మార్క్ విజువల్స్తో, కీరవాణి గ్రాండ్ మ్యూజిక్ తో తెరకెక్కిన ఓం నమో వేంకటేశాయ నాగార్జున కెరీర్లో మరో మైల్ స్టోన్గా నిలుస్తుందన్న నమ్మకంతో ఉన్నారు ఫ్యాన్స్. అన్నమయ్య కథారచయిత భారవి కథా కథనాలు అందించటం విశేషం. ప్రస్తుతం షూటింగ్తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమా ఫిబ్రవరి రెండో వారంలో రిలీజ్కు రెడీ అవుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nagarjuna Akkineni  Om Namo Venkatesaya teaser  

Other Articles