చిరు అంటే ఇష్టమే.. కానీ.. జగన్ నేరస్థుడనే నమ్ముతున్నాం | Jeevitha Rajasekhar about Chiranjeevi and YS Jagan.

Jeevitha rajashekar says why they dislike chiru

Jeevitha Rajasekhar, Jeevitha Rajasekhar Chiranjeevi, Jeevitha YS Jagan, Jeevitha Rajasekhar Congress Chiranjeevi, Jeevitha Rajasekhar YS Jagan, Jeevitha Rajasekhar interview, Chiranjeevi Rajasekhar, Jeevitha comments on Jagan

Chiranjeevi and Jagan main reason for Jeevitha Rajasekhar join BJP.

చిరు అంటే ఫ్రోఫెషనల్ గా ఇష్టమే. కానీ...

Posted: 12/24/2016 09:28 AM IST
Jeevitha rajashekar says why they dislike chiru

మెగాస్టార్ చిరంజీవి అభిమాన గణం ఎంత ఉంటుందో... ఇండస్ట్రీలో పడని వారి సంఖ్య కూడా అదే స్థాయిలో ఉంటుంది. పైకి నవ్వులు పూయించినప్పటికీ మోహన్ బాబు, జీవిత రాజశేఖర్ దంపతులు, దాసరి ఇలా మెగా ఫ్యామిలీ పై ఇండైరక్ట్ గా సెటైర్లు వేసే బాపతులు చాలా మందే ఉన్నారు. వీరిలో జీవితా రాజశేఖర్ దంపతులదైతే మరీనూ. సినిమాల్లో ఠాగూర్ సినిమా కథను లాక్కున్నారన్న ఆరోపణల దగ్గరి నుంచి వారిద్దరిపై దాడి.. చివరాఖరికి గబ్బర్ సింగ్ లో రాజశేఖర్ ను ఇమిటేట్ చేయటంతోనే అంత పెద్ద హిట్ అయ్యిందని జీవిత వ్యాఖ్యలు చేయటం దాకా అంతా కామెడీగా అనిపించకమానదు.

అయితే అసలు వారి మధ్య నిజంగా అంత పెద్ద గొడవలు ఉన్నాయా? అన్నదానిపై జీవిత తాజాగా ఓ ఇంటర్య్వూలో స్పందించింది. అప్పట్లో మీడియా చిరంజీవి రాజకీయాల్లోకి వస్తున్నారు కదా? మీరు సపోర్ట్ చేస్తారా? అని ప్రశ్నించింది. దానికి సమాధానం చెప్పారు రాజశేఖర్... "తోటి నటుడిగా చిరంజీవిని అభిమానిస్తాను కానీ.. ఆయనకు పొలిటికల్ అనుభవం లేదు. కాబట్టి నేను వేరే పార్టీకి సపోర్ట్ చేస్తున్నాను" అని బదులిచ్చాడు. అంతే ఆ విషయాన్ని చిరంజీవి గారు, తాము లైట్ తీసుకున్నాం.. కానీ, ఆయన ఫ్యాన్స్ మాత్రం ఈ చిన్న విషయాన్ని పెద్దదిగా చేశారు. తమపై దాడి చేశారు. చిరు స్వయంగా వచ్చి మీడియా ముందు చెప్పిన ఆ తర్వాత మాటల దాడులు కొందరు ఆపలేదు అంది జీవిత.

ఈ విషయాన్ని చిరు అభిమానులు పెద్దగా చేయడం వల్లే తాము కూడా సీరియస్ గా తీసుకుని చిరంజీవికి వ్యతిరేకంగా పనిచేశామని చెప్పారు. అనంతరం రాజకీయాలు వాటిలో తమకొచ్చిన అనుభవాలపై కూడా జీవిత స్పందించారు. తాము కాంగ్రెస్ పార్టీలో ఉండి చిరంజీవికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ కోసం పోరాడితే... తీరా ఎన్నికలు అయిపోయాక చిరంజీవి పార్టీ కాంగ్రెస్ లో కలిసిపోయింది. ఆ సమయంలోనే తమకు రాజకీయాలంటే ఏమిటో పూర్తిగా తెలిసిందని అనంతరమే కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చామని అన్నారు. ఇక జగన్ గురించి అడిగిన యాంకర్ కి వ్యతిరేక కామెంట్లతో షాకిచ్చింది జీవిత.

వైసీపీలో చేరిన తనను మాత్రమే జగన్ పార్టీ కార్యకలాపాల కోసం వాడుకోవాలని చూశాడని, భర్త రాజశేఖర్ కు మొండిచేయి చూపించాడని పేర్కొంది. మరి జగన్ జైలుకు వెళ్లిన సమయంలోపార్టీలోనే ఉన్న వాళ్లు నిరసన ఎందుకు తెలపలేదన్న ప్రశ్నకు బదులుగా... జగన్ దోషి అన్న వాదనను తాము బలంగా నమ్మాము కాబట్టే మద్ధతు తెలపకుండా పార్టీ నుంచి బయటకు వచ్చేశామని చెప్పటంతో ఇంటర్వ్యూ చేసిన సాక్షి యాంకర్ కి షాక్ కొట్టినట్లు అయ్యిందంట.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Jeevitha Rajasekhar  YS Jagan  Chiranjeevi  Politics  

Other Articles