ఆ ఫోటో షేర్ చేసి పరువు పొగొట్టుకుంది | Satires on Parineeti Chopra's MERI PYAARI BINDU on the set image.

Parineeti funny mask pic goes viral

Parineeti Chopra, Parineeti Chopra Mask, Parineeti Chopra Instagram, Parineeti Chopra Meri Pyaari Bindu, Parineeti wear anti-pollution mask, Meri Pyaari Bindu actress, Meri Pyaari Bindu Movie, Meri Pyaari Bindu on location, Parineeti Chopra 2016

Parineeti Chopra had to wear anti-pollution mask on 'Meri Pyaari Bindu' sets goes funny.

పరిణితి విచిత్రమైన ఫోటోపై కామెంట్లు

Posted: 12/23/2016 06:34 PM IST
Parineeti funny mask pic goes viral

బాలీవుడ్ లో ఒకప్పుడు బబ్లీ బ్యూటీ గా వరుసగా సినిమాలు చేసిన పరిణితీ చోప్రా తర్వాత అజ్నాతంలోకి వెళ్లిపోయింది. ఫిట్ నెస్ తో స్లిమ్ అవతార్ లోకి మారిపోయి అందరికీ షాకిచ్చింది. అదే ఊపుతో రెండు సినిమాలకు సైన్ చేసింది కూడా. ప్రస్తుతం వైఆర్ఎఫ్ వెంచర్ లో ఆయుష్మాన్ ఖురానా జోడీగా మేరీ ప్యారీ బిందు సినిమాతోపాటు, హిట్ పెయిర్ అర్జున్ కపూర్ తో ముబర్ ఖాన్ సినిమాలో నటిస్తోంది.

ఇక ప్రస్తుతం మేరీ ప్యారీ.. షూటింగ్ లో నిరంతరాయంగా పాల్గొంటూ ఫోటోలను షేర్ చేసుకోంటోంది. అయితే ఈ క్రమంలోనే తన ఫోటోతో పెట్టిన ఓ కామెంట్ ఆమెను విమర్శలపాలు చేసింది. ఈ సినిమా షూటింగ్ లో ఉన్న సందర్భంగా తీసిన ఓ ఫోటోను సోషల్ మీడియాలో పెడుతూ, 'సెట్ లో ఫుల్ డస్ట్ ఉంది. క్రూ మొత్తం మాస్క్స్ ధరించారు. మరి ఇంత అందంగా ఉంది మా ప్రొడక్షన్' అంటూ వ్యాఖ్య జత చేసింది. ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు మాస్క్ లు ధరించారు అని అర్ధం వచ్చేలా ఈ పోస్టు చేసింది.

అయితే ఈ ఫోటోలో పరిణీతి ఒక్కతే మాస్క్ ధరించి ఉంది. వెనుక అందరూ మామూలుగా ఉండి క్లీన్ చేస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో ఆమె అభిమానులు, నెటిజన్లు ఎవరు? మాస్క్ పెట్టుకున్నారని అడిగారు. నీకు ఒక్కదానికే మాస్క్ ఉంది. ఓసారి ఫోటోలు చూడు అంటూ కామెంట్లు పెడుతున్నారు. దీంతో ఉలిక్కిపడ్డ పరిణితీ సారీ అని అర్థం వచ్చేలా ఓ స్మైలీని ఉంచింది.

Parineeti Chopra Mask Pic

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Parineeti Chopra  Meri Pyaari Bindu  Anti-pollution mask  

Other Articles