ఆ డిప్యూటీ సీఎం కూడా మహేష్ ఫ్యానేనా! | Nitinbhai Patel visit Maheshbabu Murugadoss sets.

Surprise visitor in mahesh murugadoss movie sets

Mahesh Babu, Nitinbhai Patel, Gujarat Deputy CM Nitinbhai Patel, Deputy CM Mahesh Babu, Mahesh Babu Murugadoss Movie sets, Nitinbhai Patel Family with Mahesh Babu, Deputy CM die hard fan of Mahesh Babu, Mahesh Mania in Gujarat, Deputy CM Photo with maheshbabu, Mahesh Babu in Ahmedabad, Mahesh Babu Gujarat Fans, Mahesh Nitin

Gujarat Deputy CM Nitinbhai Patel accompanied by his family members Lands on Mahesh Babu's Sets.

మహేష్ సెట్ కి అనుకోని అతిథి

Posted: 12/22/2016 03:10 PM IST
Surprise visitor in mahesh murugadoss movie sets

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకి సౌత్ లోనే టోటల్ ఇండియాలో కూడా భీభత్సమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది. అప్పట్లో ఓ జాతీయ పత్రిక నిర్వహించిన సర్వేలో టాప్ పోజిషన్ లో నిలవటమే కాదు, యే ఏడు కా యేడు సర్వేలో ఇండియన్ సెలబ్రిటీ లిస్ట్ లో తన స్థానాన్ని పైపైకి ఎగబాకించుకుంటున్నాడు ప్రిన్స్. మరి అలాంటి స్టార్ హీరో మురగదాస్ లాంటి క్రేజ్ ఉన్న దర్శకుడితో జోడీ కడుతుంటే ఊరుకుంటారా? ప్రస్తుతం వీరి సినిమా శరవేగంగా షూటింగ్ జరపుకోంటోంది. జనవరి ఫస్ట్ 1న రిలీజ్ అయ్యే ఫస్ట్ లుక్ పోస్టర్; టైటిల్ పై అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇంకోపక్క అహ్మదాబాద్ లో యాక్షన్ సన్నివేశాలకు భారీగా తెరకెక్కిస్తున్నారు. ఈ క్రమంలో మహేష్ క్రేజ్ ఎలా ఉంటుందో తెలియజేసే సీన్ ఒకటి జరిగింది.

ఏకంగా గుజరాత్ డిప్యూటీ సీఎం నితిన్ భాయ్ పటేల్ ఫ్యామిలీ ఫ్యామిలీతో మహేష్ షూటింగ్ లో వాలిపోయాడు. నితిన్ భాయ్ కూడా మహేహ్ కి ఫ్యాన్ అంట. అందుకే షూటింగ్ జరుగుతున్న విషయం తెలుసుకుని స్పాట్ కి వెళ్లి సూపర్ స్టార్ ను కలిసి కాసేపు ముచ్చటించి సినిమా గురించి అడిగి తెలుసుకున్నాడు. అంతేకాదు ఆయన, కుటుంబ సభ్యులు మహేష్, దర్శకుడు మురగదాస్ తో కలిసి ఫోటోలు దిగారు కూడా. ఆపై ఏమైనా అవసరం అయితే కబురు పెట్టండంటూ ఓ మాట కూడా ఇవ్వటంతో మహేష్ సంతోషం వ్యక్తం చేశాడంట.

ఇప్పటికే షూటింగ్ జరుగుతున్న విషయం తెలుసుకుని షూటింగ్ స్పాట్ కి చేరిపోయి ఫోటోల కోసం ఎగబడిపోతున్నారు అక్కడి అభిమానులు. ఇక ఇప్పుడు తాజాగా ప్రముఖ నేతలు కూడా క్యూ కడుతుండటంతో సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేసుకుంటూ మురిసిపోతున్నాడు. చూస్తుంటే మహేష్ మేనియా మాములుగా లేదనిపిస్తోంది కదా!

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Mahesh Babu  Murugadoss Movie sets  Gujarat Deputy CM  Nitinbhai Patel Family  

Other Articles