ఇలియానాకు తెలుగు ఛాన్స్ .. ఆపై హ్యాండ్. ఎవరా డైరక్టర్? | Star director really cheat Ileana.

Ileana comments on tollywood star director

Ileana tollywood, Ileana about tollywood, Ileana comments on Tollywood, Star director Ileana, Ileana Telugu movies, Ileana bad time, Ileana cheated, Ileana Tollywood Movies, Tollywood star director

Ileana comments on Tollywood star director one who promise her to give a chance in Past.

టాలీవుడ్ గురించి తెగ ఫీలవుతున్న ఇల్లీ బేబీ

Posted: 12/22/2016 12:57 PM IST
Ileana comments on tollywood star director

హీరోయిన్ల టైం ఎప్పుడు ఎలా ఉంటుందో అస్సలు చెప్పలేం. వెండితెరపై ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన హీరోయన్లు కొత్త నీరు చేరికతో మొహం మొత్తేస్తుంటాయి. కానీ, కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే వచ్చిన అవకాశాలను కాళ్లదన్నుకుని మరీ బాలీవుడ్ మీద మోజుతో ఎగిరిపోయింది గోవా బ్యూటీ ఇలియానా. టాలీవుడ్ లో మూడో సినిమాతోనే కోటి రెమ్యునరేషన్ అందుకున్న నటిగా అవతరించి, తక్కువ కాలంలోనే ఆ క్రేజ్ ను పొగొట్టుకుంది.

పోనీ బాలీవుడ్ లో అయినా బ్లాక్ బస్టర్లు అందుకుంటుంది కదా అనుకుంటే ఆపై కొసరు కొసరు అవకాశాలతో నెట్టుకొస్తోంది. ప్రస్తుతం చేతిలో రెండే సినిమాలు ఉన్నాయి. వాటిలో కూడా అంత ప్రాధాన్యత లేదనే ఫీల్ అవుతోంది. అదే సమయంలో ఆ మధ్య సౌత్ లోకి తిరిగి వస్తోందన్న వార్తలపై కూడా స్పందించింది.

అవును... ఆ మధ్య ఓ తెలుగు స్టార్ దర్శకుడు సినిమా కోసం సంప్రదించాడు. నేను ఓకే కూడా చెప్పాను. మీరే నా చిత్రంలో హీరోయిన్ అంటూ నొక్కి మరీ చెప్పాడు. తర్వాత పత్తా లేకుండా పోయాడు. ఆ చిత్రం మరో స్టార్ హీరోయిన్ చేతికి వెళ్లింది. ఫోన్ చేసి కారణం అడగ్గా సారీ చెప్పి ఫోన్ పెట్టేశాడు’’ అని వివరించింది.

ప్రాణం పెట్టి సినిమాలు చేస్తాను. అవకాశం వస్తే సౌత్ లో మూవీలు చేయాలని ఉంది. ముఖ్యంగా టాలీవుడ్ ను సొంత ఇంటిలా ఫీలవుతా. కానీ, ఛాన్స్ లు ఇచ్చేది ఎవరు అని ప్రశ్నిస్తోంది ఇల్లీ బేబీ. ఆ మధ్య టూపీస్ బికినీలలో షో చేసిన అవకాశాలతో రాకపోవటంతో నిర్వేదం చెంది ఇలా కామెంట్లు చేస్తోంది ఇలియానా. ఇంతకీ ఇలియానాకు అవకాశం ఇస్తానని హ్యాండిచ్చిన స్టార్ దర్శకుడు ఎవరన్నదానిపైనే ఇప్పుడు డిస్కషన్ జరుగుతోంది. ఏదీ ఏమైనా టైం బ్యాడ్ అంటే ఇదేనేమో!

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Tollywood  Actress Ileana  Comments on Star Director  

Other Articles