పవన్ కళ్యాణ్ పూర్తిగా మారిపోయాడు | Pawan Kalyan behaviour in sets.

Pawan kalyan behaviour changed

Pawan Kalyan, katamarayudu sets, pawan selfie in Katamarayudu, katamarayudu brothers, Katamarayudu lunch with brothers, Siva Balaji lunch with Pawan, Pawan kalyan selfie in sets, pawan Kalyan behaviour changed, Pawan in Katamarayudu sets, Katamarayudu selfie with brothers

Pawan Kalyan selfie with Brothers in Katamarayudu sets.

తమ్ముళ్లతో లంచ్ చేస్తూ కాటమరాయుడు

Posted: 12/21/2016 10:25 AM IST
Pawan kalyan behaviour changed

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ షూటింగ్ లో పాల్గొంటాడు. కట్ చెప్పగానే వెళ్లి పుస్తకం చదువుతూ బిజీ అయిపోతాడు. ఇది ఒకప్పటి మాట. కానీ, ఇప్పుడు అలా కాదు. సర్దార్ గబ్బర్ సింగ్ నుంచి టోటల్ గా ఆ అలవాటు మార్చేసుకున్నాడు. సెట్లో అందరితో కలివిడిగా మాట్లాడుతుండటమే కాదు, వాళ్లందరికీ తన ఇంటి నుంచి భోజనం తెప్పించటం, వాళ్లతో కలిసి కూర్చుని తినటం లాంటివి చేస్తున్నాడు. మధ్యలో మధ్యలో బోనస్ లుగా సెల్ఫీలు దిగుతూ... అబ్బో పవన్ సెట్లో ఉంటే సందడే సందడిగా ఉంటుందని పని చేసే టెక్నిషియన్లు చెప్పుకొస్తున్నారు.

రీసెంట్ గా పవన్ తో భోజనం చేసిన అనుభవాన్ని మాటల్లో వర్ణించలేనని నటుడు శివబాలాజీ తెలిపాడు. సోషల్ మీడియాలో పవన్ కల్యాణ్ తో కలిసి భోజనం చేస్తున్న నాలుగు ఫోటోలను పోస్టు చేసిన శివబాలాజీ 'కాటమరాయుడు' షూటింగ్ లో ఈ అనుభవం సొంతం చేసుకున్నానని అన్నాడు. ఈ ఫోటోలో పవన్ కల్యాణ్, శివబాలాజీతో పాటు, అజయ్, చైతన్య, కమల్ కామరాజు ఉన్నారు. పవన్ కల్యాణ్ అద్భుతమైన వ్యక్తి అని, కొసరికొసరి వడ్డించారని శివబాలాజీ తెలిపాడు. ఈ సంతోషాన్ని వర్ణించేందుకు మాటలు చాలడం లేదని పేర్కొన్నాడు.

తమిళంలో 2014లో విజయం సాధించిన 'వీరమ్' సినిమాకి రీమేక్ గా 'కాటమరాయుడు' సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో పవన్ కల్యాణ్ కు ఈ నలుగురూ తమ్ముళ్లుగా నటిస్తున్నారు. కాటమరాయుడు మూవీని నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై శరత్‌మరార్ నిర్మిస్తుండగా, డాలీ దర్శకత్వం వహిస్తున్నాడు. పవన్‌కు జోడీగా శృతిహాసన్ నటిస్తోంది. అనూప్ రూబెన్స్ సంగీతాన్ని అందిస్తున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Katamarayudu  Pawan Kalyan lunch with Brothers  Siva Balaji Facebbok  

Other Articles