రజనీకాంత్ భార్య వాళ్లను మోసం చేస్తోందా? | Rajinikanth's wife Latha unable to pay Salaries.

Demonetization effect on superstar family

The school run by Rajinikanth's wife Latha unable to pay its employees.

రజనీ కుటుంబంపై నోట్ల రద్దు ఎఫెక్ట్

Posted: 12/21/2016 10:01 AM IST
Demonetization effect on superstar family

హఠాత్తుగా మోదీ తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయంపై ప్రజానీకం తీవ్ర ఇబ్బందులకు గురవుతోంది. ఈ వ్యవహారం సామాన్యులనే కాదు, సంపన్నులను కూడా కష్టాలకు గురి చేస్తోంది. నిర్ణయం వెలువడిన వెంటనే ఫస్ట్ పొగుడుతూ రెస్పాండ్ అయిన రజనీకే ఇప్పుడు అది ట్రబుల్ గా మారింది. రజనీ కాంత్ భార్య లత చెన్నైలో స్వచ్చంద ఆశ్రమ పాఠశాలలను నడిపిస్తున్నారు. నగరంతోసహా రాష్ట్రంలో అక్కడక్కడా ఈ స్కూళ్లు ఉన్నాయి. అయితే పెద్ద నోట్లు రద్దయిన తర్వాత తమకు జీతాలు ఇవ్వడం లేదని ఆరోపిస్తూ... అందులో పని చేస్తున్న డ్రైవర్లు ఆందోళనకు దిగారు. దక్షిణ చెన్నైలోని వెలాచెరి ప్రాంతంలో పాఠశాల ప్రాంగణంలో దాదాపు 28 మంది డ్రైవర్లు ధర్నాకు దిగడం చర్చనీయాంశం అయింది.

నిజానికి పెద్ద నోట్ల రద్దు కంటే ముందే తమ సమస్యలు మొదలయ్యాయని వారంటున్నారు. గత ఆరు నెలలుగా నెల చివరి వారంలోనే తమకు జీతాలను ఇస్తున్నారని... పెద్ద నోట్ల రద్దు తర్వాత తమ పరిస్థితి మరింత దయనీయంగా తయారయిందని డ్రైవర్లు ఆరోపించారు. ఈ పరిస్థితుల్లో తాము ఇంటి కిరాయి ఎలా కట్టుకోవాలని, ఇంటికి అవసరమైన వస్తువులను ఎలా కొనుక్కోవాలని ప్రశ్నిస్తున్నారు. మరో డ్రైవర్ తాను, తన భార్య ఆత్మహత్య యత్నం కూడా చేసినట్లు తెలిపాడు. ఈ నేపథ్యంలోనే పాఠశాల మేనేజ్ మెంట్ కు వ్యతిరేకంగా తాము ఆందోళనకు దిగాల్సి వచ్చిందని చెప్పారు.

Rajinikanth wife's Schools

అయితే ఈ విషయం లతకి తెలిసే జరుగుతుందని కొందరు డైవర్లు వ్యాఖ్యానిస్తుండగా, బ్యాంకులకు వరుసగా సెలవులు రావడం, జయలలిత మృతి చెందడం, వార్దా తుపాను తదితర కారణాలతో జీతాల చెల్లింపులు కొంచెం లేట్ అవుతున్నాయని యాజమాన్యం వివరణ ఇస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles