మల్లూ వర్మ ఇక లేరు | Malayalam actor KN Jagannatha Varma dies at 77.

Malayalam actor jagannatha varma dead

Malayalam actor KN Jagannatha Varma, KN Jagannatha Varma, Jagannatha Varma penumonia, Jagannatha Varma dies, Jagannatha Varma son, Jagannatha Varma son in law, Jagannatha Varma movies, Mallu Varma passes away

Malayalam actor KN Jagannatha Varma passes away aged 77; was ailing with penumonia.

500 చిత్రాల నటుడు కన్నుమూత

Posted: 12/20/2016 12:56 PM IST
Malayalam actor jagannatha varma dead

ప్రముఖ మలయాళ నటుడు కె ఎన్ జగన్నాథ వర్మ(77) ఇక లేరు. న్యూమోనియాతో బాధపడుతున్న ఆయన తిరువనంతపురంలోని ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందారు. కథకళి ఆర్టిస్ట్ అయిన వర్మ 575 చిత్రాలతోపాటు పలు టీవీ సీరియళ్లలో నటించాడు కూడా.

నటుడిగా కెరీర్ ప్రారంభించకముందు పోలీస్ శాఖలో ఆయన పని చేశాడు. ఆయన కుమారుడు మను వర్మ కూడా నటుడే కాగా, అల్లుడు విజి తంపి దర్శకుడు. చెర్తాలాకు చెందిన వర్మ న్యూ ఢిల్లీ, లీలం, పత్రం లాంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

మళయాల ఇండస్ట్రీలో పోలీస్ ఆఫీసర్, జడ్జ్, బిషప్ లాంటి పాత్రలకు ఆయన ఆహార్యం పర్ఫెక్ట్గా సూట్ అయ్యేది. మమ్ముటీ, సురేష్ గోపీ లాంటి స్టార్ హీరోల సినిమాల్లో ఆయన ఎక్కువగా నటించాడు. సినిమాల్లో అవకాశాలు సన్నగిల్లినప్పటికీ, నటనపై ఆసక్తి మానుకోలేకపోయారు. స్వంతగా సీరియళ్లు నిర్మించటమే కాదు, కొన్నింటిలో నటించారు కూడా. దాదాపు మూడున్నర దశాబ్దాలకు పైగా మల్లూవుడ్ కు సేవలందించిన జగన్నాథ వర్మ మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలియజేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Molly wood  KN Jagannatha Varma passes away  

Other Articles