ఆపద్భాందవుడిగా మహేష్.. ఆ లాస్ ను పూడుస్తాడా? | Mahesh again movie in Vyjayanthi banner.

Mahesh again team up with vijayanthi movies banner

Mahesh Babu 25th film, Mahesh Babu Vamsi Paidipally, Mahesh Babu Vyjayanthi Movies, Dil Raju and Ashwini Dutt, Mahesh Babu as Apadbhandavudu

Mahesh Babu Vamsi Paidipally producer changed. Dil Raju and Ashwini Dutt jointly produced this film.

ఒక లాస్ ని పూడ్చాడు... మరి దాని సంగతి?

Posted: 12/20/2016 11:08 AM IST
Mahesh again team up with vijayanthi movies banner

టాలీవుడ్  సూపర్ స్టార్ గా మహేష్ బాబు సత్తా చాటుతున్నప్పటికీ, కెరీర్ కి రాజకుమారుడితో బీజం వేసింది మాత్రం అశ్వనీదత్ వైజయంతి మూవీసే. సినిమా కమర్షియల్ సక్సెస్ కాకపోయినా టాలీవుడ్ లో ప్రిన్స్ పునాది మాత్రం గట్టిగా వేసింది. అయితే సుమారు నిర్మాణ రంగంలో 40 ఏళ్ల చరిత్ర ఉన్న వైజయంతి మూవీస్ లో ఎంతటి భారీ హిట్లు పడ్డాయో అంతటి భయంకరమైన డిజాస్టర్లు ఉన్నాయి.

ఒక సినిమాతో సంపాదించుకున్న మొత్తాన్ని భారీ సెట్టింగులు, హంగులతో పొగొట్టుకోవటం ఈ నిర్మాణ సంస్థకు ఉన్న స్పెషాలిటీ. అగ్నిపర్వతం, జగదేక వీరుడు- అతిలోక సుందరి, ఇంద్ర లాంటి ఆల్ టైం బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్లే కాదు, రావోయి చందమామ, సుభాష్ చంద్రబోస్, శక్తి లాంటి డిజాస్టర్లు కూడా వీరి ఖాతాలో ఉన్నాయి. మహేష్ తో చేసిన రెండు సినిమాలు(రాజకుమారుడు, సైనికుడు) అట్టర్ ఫ్లాపులు కావటమే ఇందుకు నిదర్శనం. ఏదేళ్ల క్రితం శక్తి వేసిన దెబ్బకి అశ్వనీదత్ సినిమాలకు దూరంకాగా మళ్లీ రీఎంట్రీ కోసం యత్నాలు ప్రారంభించేశాడు.

మహేష్ 25వ చిత్రం వంశీపైడిపల్లి దర్శకత్వంలో పీవీపీ బ్యానర్ లో ఉండబోతుందన్న విషయం ప్రిన్స్ బర్త్ డే పోస్టర్ తో విడుదల చేశాడు పొట్లూరి వరప్రసాద్. అయితే బ్రహ్మోత్సవం నష్టాన్ని పూడ్చేసేందుకే మహేష్ మరోసారి వాళ్లతో సినిమా తీయబోతున్నాడని చెప్పుకున్నాం. కానీ, రిస్క్ వద్దనుకున్న మహేష్ పీవీవీ లాస్ మొత్తాన్ని చెల్లించేసి వాళ్లని ప్రాజెక్టు నుంచి సైడ్ చేయించాడని తెలుస్తోంది. అంతేకాదు దిల్ రాజు-అశ్వనీదత్ కాంబోలో ఆ చిత్రం తెరకెక్కించబోతున్నారన్నది తాజా సమాచారం. మహేష్-మురగదాస్ సినిమా రిలీజ్ అయ్యాక ఈ ప్రాజెక్టు పట్టాలెక్కనుంది. మరి ఈసారైనా మహేష్ అశ్వనీదత్ కి లాభాలు అందిస్తాడేమో చూద్దాం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles