అభిమానులకు విశాల్ బిగ్ షాక్ | Vishal kaththi sandai release date.

Vishal shocks with kaththi sandai release

kaththi sandai release date, kaththi sandai Telugu, Okadochadu release date, Vishal Okadochadu, Okadochadu Official release date, Okadochadu Vishal

Hero Vishal announced kaththi sandai release date. Released December 23rd worldwide.

సూర్య సైడ్ అయిపోతే.. విశాల్ దూరిపోయాడు

Posted: 12/16/2016 12:15 PM IST
Vishal shocks with kaththi sandai release

తమిళనాట తెలుగు కుర్రాడైన విశాల్ రెడ్డి అకా విశాల్ హవా ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వైవిధ్యభరితమైన సినిమాలతో హిట్లు కొడుతూ, ఇంకోపక్క నడిగర్ సంఘం ఎన్నికల్లో గెలిచి సత్తా చాటిన విశాల్ సేవా కార్యక్రమాల్లో కూడా ముందుంటాడు. గతేడాది చెన్నై వరదల సందర్భంలో తన టీంతో కలిసి స్వయంగా బాధితులకు సాయం అందజేసిన విశాల్ ఇప్పుడు తుఫాన్ కారణంగా చెల్లాచెదురైన చెన్నైకి మరోసారి ఆదుకుంటున్నాడు.

ఇదిలా ఉంటే విశాల్ కథానాయకుడిగా సూరజ్ దర్శకత్వంలో తమిళంలో 'కత్తి సాందాయ్' చిత్రం తెరకెక్కింది. తమన్నా కథానాయికగా నటించిన ఈ సినిమాకి, తెలుగులో 'ఒక్కడొచ్చాడు' అనే టైటిల్ ను ఖరారు చేశారు కూడా. నిజానికి నవంబర్ 18నే ఈ సినిమాను రిలీజ్ చేయాలనుకున్నారు. అంతలోనే పెద్ద నోట్ల రద్దు నిర్ణయం రావటంతో చేసేది లేక సంక్రాంతికి షిఫ్ట్ చేసుకున్నాడు.

హఠాత్తుగా ఏమైందో తెలీదుగానీ 23నే సినిమాను రిలీజ్ చేసేందుకు విశాల్ ఇప్పుడు సిద్ధమయ్యాడు. నిజానికి ఆ రోజున సూర్య సింగం-3 రిలీజ్ కావాల్సి ఉంది. వార్థా కారణంగా తీవ్ర నష్ట జరగటంతో సూర్య తన సినిమాను పోస్ట్ పోన్ చేసుకున్నాడు. సంక్రాంతికే ఎస్-3 రిలీజ్ చేస్తామని పరోక్షంగా ప్రకటించాడు. దీంతో విశాల్ ఆ గ్యాప్ లో దూరిపోయాడు. అదే తేదీన తన సినిమాను రిలీజ్ చేస్తానని ట్విట్టర్ లో తెలియజేశాడు. అయితే తమిళ వర్షన్ తోపాటు తెలుగు వర్షన్ కి కూడా అదే రోజు రిలీజ్ చేయనున్నాడు. సేమ్ తేదీన వర్మ వంగవీటి, సప్తగిరి సప్తగిరి ఎక్స్ ప్రెస్ విడుదల కానున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Vishal  Okadochadu release date  

Other Articles