తనకు జయలలిత ఎలాంటి షాక్ ఇచ్చిందో చెప్పిన తలైవా | Rajinikanth Confess his comments behind Jayalalitha's lost.

Rajini emotional speech at jayalalitha s condolence meet

Jayalalitha Rajanikanth, Rajanikanth 1996 elections comments, Jayalalitha Kohinoor Diamond, Jayalalitha at Rajani daughter wedding, Jayalalitha 1996 elections lost, Nadigar Sangam Jayalalitha Condolence meet, Rajanikanth about Jayalalitha, How Jayalalitha Shocks Rajinikanth, Tamil film actors condole deaths of Jaya, Ramaswamy, Rajanikanth at Jayalalitha condolence meet

Rajinikanth's denouncement of Jayalalitha during the 1996 election led to her defeat, the actor said He was speaking at a condolence meet for the late Jayalalithaa. He added that he was pleasantly surprised that Jaya participated in his daughter's wedding.

అమ్మను ఎంతో బాధపెట్టా : రజనీకాంత్

Posted: 12/12/2016 08:51 AM IST
Rajini emotional speech at jayalalitha s condolence meet

అది 1996 తమిళనాట ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతున్న సమయం. అవినీతి ఆరోపణలు ఒక్కసారిగా వచ్చినప్పటికీ అమ్మ జయలలిత ప్రచారంలో దూసుకుపోతున్నారు. డీఎంకే పై ప్రజల్లో అంతంత మాత్రం ఆశలే ఉన్నాయి. అయితే ఏమనిపించిందిో ఏమో సూపర్ స్టార్ రజనీకాంత్ ఒక్కసారిగా మీడియాతో ఆసక్తిరకర వ్యాఖ్యలు చేశాడు. జయ మళ్లీ అధికారంలోకి వస్తే తమిళనాడును దేవుడు కూడా రక్షించలేడని పేర్కొన్నాడు. అంతే ఆ వ్యాఖ్యలు ప్రతిపక్షానికి ఆయుధంగా మారింది. దానిని వాళ్లు రిఫరెన్స్ గా వాడుకోని మీటింగ్ లేదంటే నమ్మొచ్చు. ఒక రకంగా జయ ఓటమికి రజనీకాంత్ కారణమయ్యారు.

కాల చక్రం గిర్రున తిరిగింది. పురుచ్ఛి తలైవి రెండు సార్లు అధికారంలోకి వచ్చింది. పదేళ్లు గడిచిపోయాయి. కానీ, ఊహించని పరిణామం జయ ఈ లోకాన్నే వదిలేసి వెళ్లిపోయింది. నడిగర్ సంఘం(సౌత్ ఇండియన్ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) ఆదివారం ఆమె సంతాప సభను నిర్వహించింది. ఈ సందర్భంగా రజనీ ఒక్కసారిగా ఉద్వేగానికి లోనై కంటతడి పెట్టాడు.

జయలలితను తాను చాలా బాధపెట్టానని సూపర్ స్టార్ ఆవేదన వ్యక్తం చేశాడు. 1996 ఎన్నికల్లో తాను చేసిన వ్యాఖ్యల వల్లే జయలలితకు చెందిన అన్నాడీఎంకే పార్టీ ఓటమిపాలయిందని ఆయన తెలిపారు. తాను జయకు వ్యతిరేకంగా వ్యవహరించానన్న విషయం తనను ఇప్పటికీ కలచివేస్తోందని చెప్పారు. జయను కోహినూర్ వజ్రంగా అభివర్ణించారు. ఆమె ఎదుర్కొన్న ఆటుపోట్లే ఆమెను సానపట్టిన వజ్రంలా మార్చాయని చెప్పారు. పురుషాధిక్య ప్రపంచంలో ఆమె చేసిన పోరాటం అసాధారణమైనదని... అదే ఆమెను ఉన్నత శిఖరాలకు చేర్చిందని అన్నారు.

తనకు, జయకు మధ్య వివాదం ఉన్నప్పటికీ... తన కుమార్తె వివాహానికి ఆమె హాజరు కావడం తనను కూడా ఆశ్చర్యానికి గురి చేసిందని చెప్పారు. తన కుమార్తె వివాహానికి ఆహ్వానించడానికి బరువెక్కిన హృదయంతో ఆమె అపాయింట్ మెంట్ కోరానని... ఆమె తనతో మాట్లాడతారని కూడా ఊహించలేదని తెలిపారు. జయ మన మధ్య లేకపోవడం తీరని లోటు అంటూ ఎమోషనల్ గా స్పీచ్ ఇచ్చాడు తలైవా.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rajanikanth Jayalalitha  Nadigar Sangam Condolence meet  

Other Articles