బాలయ్య పదే పదే తేదీ మార్చేది ఆయన కోసమే | Audio Launch And Trailer Release Date Of 'Gautamiputra Satakarni'.

Satakarni audio launch postponed to dec 24th

Balakrishna Gautamiputra Satakarni , Gautamiputra Satakarni Audio, Gautamiputra Satakarni Audio Launch date, GSP audio launch, GSP postponed, Satakarni Audio Date, Satakarni Audio Chandrababu, Chandrababu Satakarni Audio, Chandrababu Venkaiah GSP Audio, GSP Audio Chief guests

Balakrishna Gautamiputra Satakarni Audio Launch Postponed to December 24th.

శాతకర్ణి ఆడియో మాత్రమే మారింది

Posted: 12/09/2016 04:00 PM IST
Satakarni audio launch postponed to dec 24th

క్రిష్ దర్శకత్వంలో రూపొందిన 'గౌతమీపుత్ర శాతకర్ణి' సంక్రాంతికి రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. జనవరి 12 సినిమాను విడుదల చేయాలని క్రిష్ తదితరులు భావించారు. రిలీజ్ డేట్ లో కాస్త సస్పెన్స్ ఉన్నప్పటికీ, ఆడియో వేడుక కోసం మాత్రం ఇప్పటికే ముమ్మర ఏర్పాట్లు జరిగిపోయాయి. డిసెంబర్ 16న తిరుపతిలోని బసవతారకమ్మ స్టేడియంలో ఏర్పాట్లు ప్రారంభించేందుకు నిర్మాతలు సన్నద్ధం అయ్యారు. అయితే మరోసారి డేట్ మారినట్లు అఫీషియల్ గా చిత్ర నిర్మాతలు ప్రకటించేశారు.

కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చంద్రబాబు నాయుడు .. వెంకయ్య నాయుడుతో పాటు చిత్రంలో రాజమాత గౌతమి పాత్ర పోషించిన హేమమాలినిలను ఆహ్వానించాలని ఫ్లాన్ చేసుకోగా, ఆరోజు వారికి కుదరకపోవచ్చని చెప్పారంట. దీంతో ఆడియోను 24కు షిఫ్ట్ చేసేసింది చిత్ర యూనిట్. అయితే అభిమానులను ఏ మాత్రం నిరాశపరచకుండా 16వ తేదీన మాత్రం ట్రైలర్ ను వదలాలని నిర్ణయించుకున్నారట.

నిజానికి ఈరోజే ట్రైలర్ వదలాలని నిర్ణయించుకున్నప్పటికీ, ధృవ రిలీజ్ అవుతుండటం, పైగా థియేటర్లలో చిరు టీజర్ ను ప్రదర్శిస్తుండటంతో వాయిదా వేసుకుంది తెలిసిందే. క్రిష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి కంచె సంగీత దర్శకుడు చిరంతన్ భట్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : GSP Audio Date Change  Balakrishna  Chandrababu Naidu  

Other Articles

Today on Telugu Wishesh