ఫ్లాఫైనా పైసా నష్టపోలేదా! ఎలా? | Even though flop talk Bethaludu saved.

Vijay saved with bethaludu satellite rights

Vijay Antony's Bethaludu, Bethaludu Flop Talk, Bethaludu Satellite Rights, Zee TV Bethaludu Satellite, Vijay saved with Satellite Rights, Bethaludu Safe Zone, Vijay Antony' Bethaludu collections

Vijay Antony's Bethaludu Satellite Rights Sold Out for Fancy Price.

భేతాళుడు భలేగా తప్పించుకున్నాడు

Posted: 12/09/2016 04:24 PM IST
Vijay saved with bethaludu satellite rights

తమిళంలో మ్యూజిక్ డైరక్టర్ గా కెరీర్ ప్రారంభించి ఆపై సైలెంట్ హీరోగా కూడా క్రేజ్ సంపాదించేసుకున్నాడు విజయ్ ఆంటోనీ. బిచ్చగాడు అనే ఒక్క సినిమాతో తెలుగు ప్రేక్షకుల్లో కూడా స్థానం సంపాదించేసుకున్నాడు. కోట్లలో నిర్మాతలకు లాభాలను పంచిపెట్టిన ఆ సినిమా చివరకు చదలవాడ ఇంట భారీగానే కాసులను రాల్చింది. దీంతో తర్వాతి చిత్రం భేతాళుడిపై సొంతగా తానే బిజినెస్ చేసేశాడు విజయ్.

అయితే సినిమాకు టాక్ బాగా ఉన్నప్పటికీ, సెకంఢాఫ్ దెబ్బకొట్టేయటం, పైగా పోటీగా వచ్చిన మోహన్ లాల్ మన్యంపులికే ఎక్కువ మంది ఓటేయటంతో భేతాళుడు భారీగానే నష్టాలను చవిచూడాల్సి వస్తుందని అంతా భావించారు. కానీ, అలాగ జరగలేదు. పైసా నష్టం లేకుండా విజయ్ సేఫ్ గా బయటపడ్డాడు. ఎలాగంటారా? శాటిలైట్ రైట్స్ రూపంలో...

సినిమా రిలీజ్ కు ముందే ఈ చిత్రాన్ని తెలివిగా జీ ఛానెల్ వారికి కోటి ముప్పై లక్షలకు అమ్మేశాడు విజయ్. సదరు ఛానెల్ వాళ్లు కూడా బిచ్చగాడు టీఆర్పీని దృష్టిలో పెట్టుకుని ఈ డబ్బింగ్ చిత్రాన్ని ఫ్యాన్సీ రేటుకు కొనేశారు. దీంతో భారీగా నష్టాలను చవిచూసే అవకాశం లేకుండా భేతాళుడు బయటపడగలిగాడు. మరి బుల్లితెరపై అయినా భేతాళుడు ప్రభంజంనం ఉంటుందా తెలియాలంటే కొద్దిరోజులు ఆగితే సరి. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Vijay Antony  Bethaludu Satellite rights  Zee Telugu Fancy Price  

Other Articles