షారూఖ్ ట్రైలర్ తోనే బ్లాక్ బస్టర్ అనిపించేశాడు... | Raees’ trailer proves SRk’s film is a blockbuster.

Sharukh raees trailer launched

Raees' trailer, Shahrukh Khan New Movie Trailer, Raees Trailer, Raees Trailer review, Shahrukh Khan Raees, Sunny Leone, Laila Main Laila Raees, Sunny Leone look in Laila Main Laila

Raees' trailer out, Shahrukh Khan looks menacing as bootlegger.

షారూఖ్ రాయిస్ ట్రైలర్ విడుదల

Posted: 12/07/2016 03:28 PM IST
Sharukh raees trailer launched

చిన్నప్పటి నుంచి అమ్మ చెప్పిన బిజినెస్ సూత్రాన్ని వంటబట్టించుకున్న షారూఖ్ ఇల్లీగల్ దందాలో చేరి కింగ్ అయిపోయాడు. నిజంగా కాదులేండి. రాయిస్ సినిమా కోసం... షారూఖ్ ఖాన్ హీరోగా పర్జానీయా ఫేం రాహుల్ దోలకియా దర్శకత్వంలో తెరకెక్కిందే రాయిస్. షారూఖ్ హీరో కావటం, పైగా అబ్దుల్ లతీఫ్ అనే గ్యాంగ్ స్టర్ లైఫ్ మీద తీసిన కావటం, టీజర్ అప్పట్లోనే రిలీజ్ అయి ప్రభంజనం కూడా సృష్టించటంతో చిత్రంపై అంచనాలు బాగానే ఉన్నాయి.

ఇక తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్ లో షారూఖ్ విశ్వరూపం చూపించాడు. లిక్కర్ మాఫియా కింగ్ అయిన రాయిస్ అలాంకి, అతన్ని పట్టుకునేందుకు వచ్చిన ఏసీపీ గులాం పటేల్ గా నవాజుద్దీన్ సిద్ధిఖీ మధ్య జరిగే పోరే రాయిస్. ఇద్దరూ విలక్షణ నటులే.. పోటీపడి మరీ నటించినట్లు తెలుస్తోంది. ఏదీ చిన్న దందా కాదు.. దందాలో ఏదీ ధర్మం కాదు అంటూ మొదటి డైలాగ్ ఓపెన్ ట్రైలర్ చివరి దాకా పవర్ ఫుల్ పంచ్ లతోనే సాగింది. నువ్వు చేసేది క్రైం అని గులాం చెబితే.. గుజరాత్ గాలిలోనే ఆ దందా ఉంది. నా ఊపిరిని ఆపోచ్చుగానీ, గాలిని ఆపలేవు అంటూ షారూఖ్ చెప్పిన డైలాగ్ పేలిపోయింది. సడన్ గా లవ్ ట్రాక్ లోకి మారిపోవటం, మోహిన్షా(మహిరా ఖాన్)తో రొమాన్స్ ట్రాక్ చూపించారు. ఆపై మళ్లీ సీరియస్ లోకి షిఫ్ట్ అయిపోయింది.

 

యాక్షన్ సీక్వెన్స్ లో షారూఖ్ దుమ్మరేగొట్టాడు. చివర్లో లైలా మే లైలా పాట రీమిక్స్ లో సన్నీలియోన్ ని కాసేపు చూడటం, ఆపై బ్యాగ్రౌండ్ స్కోర్.. మై ఆ రహాహూ.. అంటూ కింగ్ ఖాన్ డైలాగ్ ఇలా ముగిసిపోయింది రాయిస్ ట్రైలర్. గత సినిమాలకు పాజిటివ్ టాక్ వచ్చిన్నప్పటికీ, కలెక్షన్ల విషయంలో మాత్రం షారూఖ్ వెనకబడే ఉన్నాడు. కనీసం ఈ సినిమాతోనైనా బాద్ షా ఆ కోరిక తీర్చుకుంటాడేమో చూద్దాం. జనవరి 25న రాయిస్ ప్రేక్షకుల ముందుకు రానుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : SRK  Raees trailer  Laila Main Laila Sunny Leone  

Other Articles