పూరీ కొత్త సినిమా జస్ట్ పొలిటికల్ సెటైర్ కాదేమో! | Interesting Title Registered at Film Chamber for Puri new movie.

Variety tilte for puri multi starrer movie

Puri Jagannath's new movie, Moodu Kothulu.. Oka Meka, Moodu Kothulu.. Oka Meka Satire, Puri MKOM, Puri Jagannath Multi Starrer title, Puri new movie satire on Mega Family

Puri Jagannath's new movie title fixec as 'Moodu Kothulu.. Oka Meka', Puri multi starrer title fixed

పూరీ కొత్త సినిమా విచిత్రమైన టైటిల్

Posted: 12/07/2016 01:26 PM IST
Variety tilte for puri multi starrer movie

ఏ కాంబినేషన్ లో అయినా సరే ఓ సినిమా గురించి మాట్లాడుకోవాలంటే మాత్రం ముందు టైటిల్ విషయంలోనే ఏదో ఒక స్పెషాలిటీ ఉండి తీరాల్సిందే. క్రేజీ డైరక్టర్ పూరీ విషయంలో అయితే అది మరీను. తిట్ల దగ్గరి నుంచి క్యాచీగా ఉండేలా పేర్లను తన సినిమాలకు పెట్టేస్తుంటాడు. ఆ రకంగా సినిమాలో కంటెంట్ ఉన్నా లేకపోయినా జనాల అటెన్షన్ ను కొట్టేస్తుంటాడు. చివరి సినిమా ఇజం, అంతకు ముందు వచ్చిన లోఫర్ కూడా ఈ కోవలోనివే...

ఇక ఇప్పుడు మరో టైటిల్ ను రిజిస్టర్ చేయించినట్లు తెలిసింది. మూడు కోతులు.. ఒక మేక అంటూ ఓ చిత్రాన్ని తీసేందుకు పూరీ ఫ్లాన్ వేసుకుంటున్నాడు. ముగ్గురు యంగ్ హీరోలతో తీయబోతున్న ఈ మల్టీస్టారర్ మూవీ ఓ ప్రేమకథగానే కాకుండా, పొలిటికల్ సెటైర్ గా తెరకెక్కబోతుందని తెలుస్తోంది. ఒకే అమ్మాయితో ముగ్గురు ప్రేమలో పడటం, అదే సమయంలో ఆ యువకులు చేసే రాజకీయాలతో సినిమాను రూపొందించబోతున్నాడంట పూరీ.

సాధారణంగా ఇలాంటి విషయాల్లో పూర్తీ స్వేచ్ఛ తీసుకునే పూరీ సమకాలీన రాజకీయాలను ఎలా చూపించబోతున్నాడో అన్న చర్చ అప్పుడే మొదలైంది. ఇక అఫీషియల్ గా త్వరలో అనౌన్స్ కాబోయే ఈ ప్రాజెక్ట్ కోసం సందీప్ కిషన్, నాగ శౌర్యలను ఇప్పటికే ఇద్దరు హీరోలుగా ఎంపిక చేసినట్లు చెప్పుకున్నాం. హీరోయిన్ గా కొత్త అమ్మాయి వేటలో ఉన్నాడంట పూరీ. ఇంకోవైపు ఈ సినిమా ఓ ఫ్యామిలీని టార్గెట్ చేసి సిద్ధం చేసిన కథ అని, వారిపై సెటైరిక్ గా తీయబోయే సినిమా అయి ఉండొచ్చన్న గాలి వార్తలను కొందరు లేపుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Puri Jagannath new movie  Moodu Kothulu.. Oka Meka  

Other Articles