ఆ అత్యాచారాలను సోసైటీ గుర్తించటం లేదు: కత్రినా ఇంట్రెస్టింగ్ కామెంట్లు | Katrina says Women should speak up about marital rape.

Women should speak up about marital rape

Katrina Kaif, Katrina Kaif Rape, Katrina Kaif Marital rape, Katrina Kaif Domestic violence, Katrina rape Comments, Katrina Kaif about rape, Katrina Kaif on Woman Education, marital rape Katrina Kaif

Katrina Kaif feels Society fails to recognize marital rape as crime.

రేప్ జరిగితే ధైర్యంగా చెప్పేయండి...

Posted: 12/07/2016 11:57 AM IST
Women should speak up about marital rape

పెళ్లయిన ఆడాళ్ల భద్రతపై సెక్సీ బ్యూటీ కత్రినా కైఫ్ క్లాసులు పీకుతోంది. వారిపై జరుగుతున్న అత్యాచారాలు, అఘాయిత్యాలను అరికట్టడంలో ప్రభుత్వాలు వైఫల్యం చెందుతూనే ఉన్నాయంటూ మండిపడుతోంది. చట్టాలు ఎన్ని తెస్తున్నా, శిక్షలు ఎంత కఠినతరం చేస్తున్నా ఈ దురాగతాలు ఆగటం లేదంటూ, వీటిని నిర్మూలించాలంటే ఒకటే మార్గమని సూచిస్తోంది.

‘‘మీపై జరుగుతున్న వైవాహిక అత్యాచారాలు, ఇతర హింసలపై మహిళలు నోరు విప్పాల్సిన అవసరం ఉంది. మీరు భయపడినంత కాలం ఇలాంటివి కొనసాగుతూనే ఉంటాయి. అన్యాయాన్ని బయటకు చెప్పినప్పుడే న్యాయం జరుగుతుంది. మనం అన్నింటిల్లో ముందుకు సాగిపోతున్నాము.. కానీ దీని విషయంలో ఎందుకు భయపడుతున్నారు?.. ధైర్యంగా పోరారండి. ప్రతి ఒక్కరూ మీవెంటే ఉంటారని తెలిపింది.

చదువుకున్న మహిళలు సైతం కొన్నిసార్లు సామాజిక కట్టుబాట్ల కారణంగా మౌనంగా ఉంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వైవాహిక అత్యాచారాన్ని నేరంగా గుర్తించడంలో సమాజం విఫలమైందన్నారు. ఇప్పటికైనా మహిళలు ధైర్యంగా ముందుకు రావాలని, ఎదురించి తాము అబలలం కాదని నిరూపించాలని కత్రినా కైఫ్ పిలుపునిచ్చింది. కాగా, ప్రస్తుతం చేతిలో సినిమాలేవీ లేని కాట్ మనీశ్ మలోత్రా ఫోటో షూట్ తోపాటు, ఈ మధ్య అతని బర్త్ డే ఫంక్షన్ లోనూ హాట్ హాట్ గా మెరిసిపోయింది.

Kat at Manish malhotra Birthday Party

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Katrina Kaif  marital Rape  Domestic violence  

Other Articles

Today on Telugu Wishesh