నాగ్ కొత్త బీఎండబ్ల్యూ కారు.. ఖరీదు తెలిస్తే షాకవుతారు | Nag buys new BMW car

Nagarjuna new bmw car details

Akkineni Nagarjuna, Nag new BMW car, Nag new Car, Nag buys new BMW, Nag new car, Nagarjuna new BMW, 1.87 crore Nag new Car, Nag new car number, BMW 7 series car Nagarjuna

Akkineni Nagarjuna Buys new BMW car and Hul chul at registration office.

నాగ్ కొత్త బీఎండబ్ల్యూ కారు ఖరీదు ఎంతంటే...

Posted: 12/02/2016 09:04 AM IST
Nagarjuna new bmw car details

ఆరు పదుల వయసు దగ్గర పడుతున్న టాలీవుడ్ అగ్రహీరో అక్కినేని నాగార్జున మెయింటెన్ చేసే స్టైల్ కి కుర్రహీరోలు కూడా దాదాపు దరిదాపుల్లో లేరనే చెప్పాలి. కాస్టూమ్స్ దగ్గరి నుంచి గాడ్జెట్స్, ఇంటీరియర్స్, కార్లు ఇలా ఎప్పటికప్పుడు నాగ్ స్టైలింగ్ ట్రెండ్ కు అనుగుణంగానే ఉంటుంది.

మార్కెట్ లోకి కొత్త కారు వచ్చిందంటే చాలూ నాగ్ కాంపౌండ్ లో దాదాపు అది ఉండాల్సిందే. రీసెంట్ గా హీరో నాగార్జున సరికొత్త బీఎండబ్ల్యూ కారును కొనుగోలు చేశారు. బీఎండబ్ల్యూ 7 సిరీస్ లో వచ్చిన ఈ కారు ఖరీదు అక్షరాల కోటి 87 లక్షలు. 445 హెచ్పీ సామర్థ్యమున్న కారు. 4.4 లీటర్ టర్బో చార్జ్ డ్ పెట్రోల్ ఇంజన్ సాయంతో నాలుగు సెకన్లలోనే 100 కి.మీ వేగాన్ని అందుకుంటుంది. అల్యూమినియం బాడీ, కార్బన్ ఫైబర్ రీ ఇన్ ఫార్స్ ప్లాస్టిక్, విలాసవంతమైన ఇంటీరియర్, రిమోట్ కంట్రోల్ పార్కింగ్, టచ్ కమాండ్ సిస్టమ్ వంటివి ఈ కారు ప్రత్యేకతలు.

ఈ కారు రిజిస్ట్రేషన్ కోసం హైదరాబాద్ లోని ఆర్టీయే ఆఫీసుకు వచ్చిన ఆయన, ఫోటో దిగి డిజిటల్ సంతకం చేశారు. ఆపై టీఎస్ 09 ఈక్యూ 9669 నంబరును ఎంపిక చేసుకుని రిజిస్ట్రేషన్ విధానాన్ని పూర్తి చేయించారు. ఈ యేడాది అఖిల్ పుట్టిన రోజు సందర్భంగా కూడా ఓ బీఎండబ్ల్యూ కారునే నాగ్ గిఫ్ట్ గా ఇచ్చిన విషయం తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Akkineni Nagarjuna  New BMW car  registration  

Other Articles