రేప్ అనుభవం గురించి హన్సిక | Hansika about rape experience

Hansika fears with rape

Hansika Motwani, Hansika rape, Hansika Uyire Uyire movie rape Scene, Milky actress fears with Rape, Hansika rape experience, Hansika Bogan Movie, Hansika about Bogan

Hansika says she won't act in Rape scenes in Future:

హన్సికకు రేప్ భయం పట్టుకుంది

Posted: 11/30/2016 09:58 AM IST
Hansika fears with rape

కోలీవుడ్ లో చబ్బీ మిల్కీ సొగసరి హన్సిక  నటించిన సినిమా రిలీజ్ అయి ఆరునెలలు దాటిపోయింది. ప్రస్తుతం ఆమె చేతిలో జయం రవి ‘బోగన్’ తప్ప ఇంకేం లేవు. అది కూడా రిలీజ్ కు రెడీ అయిపోయింది. తెలుగులో విష్ణు సరసన లక్కున్నోడులో కనిపించనుంది. కొత్త ప్రాజెక్టులపై సంతకం చేయకపోవటంతో హన్సిక సినిమాలకు గుడ్ బై చెబుతుందన్న పుకార్లు రేగాయి. అయితే కావాలనే కాస్త గ్యాప్ ఇచ్చినట్లు హన్సిక చెబుతోంది.

బోగం రిలీజ్ సందర్భంగా ఇస్తున్న ఇంటర్వ్యూలో హన్సిక చాలా విషయాలే చెప్పుకొచ్చింది. గ్లామర్ డాల్ గానే సినిమాలు ఎందుకు చేస్తున్నారు అన్న ప్రశ్నకు సమాధానంగా... అన్ని అలాంటి రోల్స్ వస్తున్నప్పుడు తాను మాత్రం ఏం చేయగలనంటోంది. అయితే భవిష్యత్తులో ఎట్టి పరిస్థితుల్లో మాత్రం రేప్ సీన్లలో నటించే ప్రసక్తే లేదని అంటోంది. అందుకు కారణం ఇంతకు ముందు జరిగిన ఓ ఎక్స్ పీరియన్సేనంట.

ఆ మధ్య హన్సిక నటించిన ఉయిరే.. ఉయిరే...(ఇష్క్ రీమేక్ ) లో ఓ రేప్ సీన్ లో హన్సిక కనిపించింది. ఆ సీన్ చాలా వల్గర్ గా ఉందంటూ చాలా విమర్శలు వచ్చాయి. సినిమా కూడా బోక్కాబోర్లా పడింది. దీంతో ఇంకెప్పుడు రేప్ సీన్లలో నటించబోనని హన్సిక తేల్చి చెప్పేసింది. మరోవైపు బోగన్ సినిమా ద్వారా తాను మళ్లీ వరుస అవకాశాలతో బిజీ అయిపోతానన్న కాన్ఫిడెన్స్ వ్యక్తం చేస్తోంది.  

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Hansika Motwani  rape Scene  Uyire Uyire  

Other Articles