దంగల్ రిలీజ్.. అమీర్ మళ్లీ అదేపని... | Dangal release Aamir did it again.

Not happy that i am smoking again

Aamir Khan bad habbits, Aamir Khan smoke, Aamir Khan, Dangal release, Aamri SRK salman smoke, Aamir Khan cigar

Aamir Khan: Not happy that I am smoking again, will give up after 'Dangal' release.

టెన్షన్ లో అమీర్ దమ్ము మీద దమ్ము

Posted: 11/30/2016 08:59 AM IST
Not happy that i am smoking again

మిస్టర్ ఫర్ ఫెక్షనిస్ట్ అమీర్ ఇప్పుడు తెగ ఫీలయిపోతున్నాడు. మల్లయోధుడు మహవీర్ సింగ్ జీవిత గాథ దంగల్ సినిమా రిలీజ్ కాబోతుంది కదా అందుకేనేమో అనుకుంటున్నారా? అవును.. 51 ఏళ్ల ఈ సీనియర్ నటుడు టెన్షన్ తో టెన్షత్ తో ఊగిపోతున్నాడు. మరి అది తగ్గాలంటే ఏదో ఒకటి చేయాలి కదా.... అందుకే పొగ తాగటం మొదలుపెట్టాడంట.

స్మోకింగ్ అలవాటు ఉన్న అమీర్ ఈ ఏడాది ప్రారంభంలో దానిని మానేశాడంట. అయితే ‘దంగల్’ సినిమా విడుదల నేపథ్యంలో ఒత్తిడి తట్టుకోలేక మళ్లీ పొగతాగుతున్నానని అమీర్ తెలిపాడు. పొగతాగకుండా ఉండాలనే ప్రయత్నించానని, కానీ, ‘దంగల్’ విడుదల తేదీ సమీపిస్తుండటంతో ఒత్తిడి తట్టుకోలేక మళ్లీ ప్రారంభించానని .. ఈ సినిమా విడుదల తర్వాత పొగతాగడం ఆపేస్తానని చెప్పాడు. గతంలో 3 ఇడియట్స్, పీకే సినిమాల సమయంలో కూడా అమీర్ ఇలానే చేశాడంట.

పొగతాగే అలవాటు నటనపై ఎటువంటి ప్రభావం చూపదు కానీ, ఆరోగ్యంపై చూపిస్తుందని అన్నాడు. కాగా, రీసెంట్ గా కాఫీ విత్ కరణ్ లో అక్షయ్ కుమార్ మాట్లాడుతూ... స్మోకింగ్ డ్రికింగ్ అలవాటు ఉంటే వారు ఖచ్ఛితంగా పెద్ద స్టార్లు అవుతారని వ్యాఖ్యానించాడు కూడా. ఆ విషయం పక్కనపెడితే ‘దంగల్’ సినిమా డిసెంబర్ 23న ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగులోనూ యుద్ధం పేరుతో అదే రోజున విడుదల అవుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : aamri Khan  Dangal movie  Cigar smoke  

Other Articles