ఆ లీకైన వీడియోలో ఉంది మంజునే.. కానీ, అసలు మ్యాటర్ వేరేలా? | Manju Warrier reacting to Dileep's wedding video viral.

Manju warrier reacting to dileep s wedding fake

Manju Warrier, Dileep and Kavya Madhavan, viral video of Manju Warrier, Dileep and Kavya’s wedding, Manju on Dileep and Kavya’s wedding

This viral video of Manju Warrier reacting to Dileep and Kavya’s wedding is Fake.

హీరోయిన్ వైరల్ వీడియో అంతా ఫేక్

Posted: 11/29/2016 09:57 AM IST
Manju warrier reacting to dileep s wedding fake

మళయాళంలో ఒకప్పుడు స్టార్ నటిగా వెలుగొందిన మంజు వారియర్ కి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం నెట్ లో వైరల్ గా మారింది. దెబ్బకి ఆమె ఫేస్ బుక్ ఖాతాలో అభిమానులంతా రియాక్ట్ అవ్వటం మొదలుపెట్టారు. ‘‘డియర్ మంజూ.. భయపడాల్సిన అవసరం లేదు. దేవుడు నీతో ఉన్నాడు.. ధైర్యంగా ముందుకు వెళ్లూ... ఇలాంటి కామెంట్లు బోలెడన్నీ కనిపిస్తున్నాయి.

అయితే ఆ వీడియో హీరోయిన్ దే అయినప్పటికీ, అందులో ఉన్న కామెంట్లకి అక్కడ పేర్కొన్న వార్తకి పొంతన లేకపోవటమే ఇక్కడ హైలెట్ కామెడీ. నటుడు, మంజు మాజీ భర్త దిలీప్ మొన్నే టాప్ హీరోయిన్ కావ్యమాధవన్ ను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. కావ్య పెట్టిన చిచ్చు కారణంగానే వారిద్దరూ విడిపోయారనే ఓ రూమర్ ఉంది. కానీ, ఈ విషయంలో అటు మంజుగానీ, ఇటు కావ్య గానీ స్పందిచిన దాఖలాలు లేవు. ఏదైతేనేం మొత్తానికి ఆ లైలా మజ్నులు ఒకటయ్యారు.

ఇక మంజు వారియర్ వారి పెళ్లిపై స్పందించిందంటూ ఓ వీడియో నెట్ లో వైరల్ గా మారిపోయింది. కానీ, తీరా వీడియో లోపలికి వెళ్లి చూస్తే అదంతా ఉత్తదేనని తేలిపోయింది. ప్రముఖ నగల సంస్థ కళ్యాణ్ జ్యువెల్లరీ యాడ్ కోసం రూపకల్పన చేసిన సమయంలో తీసిన ఓ మినీ ఇంటర్వ్యూ అందులో ఉంది. తన నటనను ప్రారంభించినప్పటి నుంచి సెకండ్ ఇన్నింగ్స్ గా భావించిన ఈ యాడ్ దాకా మొత్తం విషయాలను చెప్పుకొచ్చింది. ముఖ్యంగా అమితాబ్ తో స్క్రీన్ షేర్ చేసుకోవటం గురించి అందులో ఉంది. ఇక వీడియో పూర్తిగా చూడకుండా అభిమానులు ఆమె ఫేస్ బుక్ టైమ్ లైన్ ను మొత్తం సానుభూతి కామెంట్లతో నింపేశారన్నమాట. టూమచ్ కదా!

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Manju Warrier  Viral Video  Dileep Kumar  Kavya Madhavan  wedding  

Other Articles