మిల్కీ సీక్రెట్ ను అతను ఎప్పుడో చెప్పేశాడు | Tamanna excite about queen remake.

Tamanna surprise secret revealed

Tamanna, Suhasini and Revathi, Queen Tamil remake, Tamanna in RGG-2, Tamanna secret, Tamanna secret

Tamanna surprise secret revealed. Confirmed Suhasini and Revathi for that crazy project.

తమన్నా సర్ ప్రైజ్ ముందుగా ఊహించిందే...

Posted: 11/29/2016 08:28 AM IST
Tamanna surprise secret revealed

మిల్కీబ్యూటీ తమన్నా త్వరలో తానో సర్ ప్రైజ్ ఇవ్వబోతున్నానంటూ ప్రకటించిన విషయం తెలిసిందే. కొత్త ప్రాజెక్టులా? లేక పెళ్లికి సంబంధించిన మ్యాటరేమో? అంటూ అభిమానులు కాసేపు తలలు పట్టుకున్నారు. అయితే అది బాలీవుడ్ లో ఓ హిట్ మూవీ రీమేక్ కు సంబంధించిన వార్త అని సాయంత్రకల్లా లీక్ అయిపోయింది.

హిందీలో కంగనా రనౌత్ నటించిన క్వీన్ సినిమా విడుదలై ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో తెలిసిందే. అటువంటి హిట్ సినిమాని తెలుగు, తమిళం,మలయాళ, కన్నడ భాషల్లో రీమేక్ చేయాలనీ ఫ్లాన్ నడుస్తోంది. అల్రెడీ త్యాగరాజన్ అనే నిర్మాత భారీగా చెల్లించి రైట్స్ కూడా కొనేశాడు.

ఇక తమిళ్ లో క్వీన్ పాత్రలకు తమ్మూ ఎంపికైందని అల్రెడీ చెప్పుకున్నాం కూడా. ఇప్పుడు మిల్కీ ఇద్దామనుకున్న సర్ ప్రైజ్ కూడా అదేనంట. కాకపోతే క్రేజీ కాంబోగా ఈ చిత్రం తెరకెక్కనుంది. సీనియర్ హీరోయిన్ లు సుహసిని, రేవతిలు క్వీన్ కోసం వర్క్ చేయనున్నారు. రేవతి దర్శకత్వం వహిస్తుండగా, సుహసిని మాటలు అందిస్తోందంట. ఇక మలయాళంలో అమలాపాల్, కన్నడంలో పరుల్ యాదవ్ లు 'క్వీన్'గా సందడి చేయనున్నారు. తెలుగు 'క్వీన్' ఎవరనేది ఇంకా ఖరారు చేయలేదని తెలుస్తోంది.

‘‘నేను నటించబోయే సినిమాల గురించి ఇప్పుడేం చెప్పలేను. కానీ, అవేంటో తెలిస్తే నా అభిమానులతో సహా ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతారు. ఆ సినిమాల్లో నేనూ ఓ భాగం అవుతున్నానని తెలియగానే చాలా సంతోషపడ్డా’ అంటూ చెప్పిన విషయం తెలిసిందే. మరోవైపు ఓంకార్ రాజుగారి గది-2 లో కూడా తమన్నా నటించబోతుందన్న వార్త ఒకటి చక్కర్లు కొడుతోంది. నాగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం ఇప్పటికే సీరత్ కపూర్ ను ఓ హీరోయిన్ గా తీసేసుకున్నారంటూ వార్తలు వచ్చాయి కూడా.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Tamanna  Tamil queen remake  Revathi and Suhasini  

Other Articles

Today on Telugu Wishesh