విశాల్ రివెంజ్ మరీ ఇంతలానా? | Sarathkumar, Radha Ravi stripped of Nadigar Sangam membership.

Vishal sweet revenge on sarathkumar

Sarathkumar, Radharavi, Chandrasekar, Nadigar Sangam Clash, Vishal Sarathkumar, Nazar Vishal and Karthi, Karthi Nadigar Sangam

Sarathkumar, Radharavi & Chandrasekar permanently removed from Nadigar Sangam.Violent clashes erupt at Nadigar Sangam meeting

శరత్ కుమార్ కి విశాల్ సాలిడ్ షాక్

Posted: 11/28/2016 08:21 AM IST
Vishal sweet revenge on sarathkumar

టాలీవుడ్ లో మా (మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్) లాగా కోలీవుడ్ లో నడిగర్ సంఘం ఉంది. మాములుగా ఇలాంటి వాటిల్లో వర్గ పోరులు తప్పకుండా ఉంటాయి. కానీ, నడిగర్ లో అవి ఎప్పుడూ తారా స్థాయిలో ఉంటాయి. సౌత్ ఇండియన్ ఆర్టిస్ట్ అసోషియేషన్ లో అక్రమాలకు పాల్పడ్డారంటూ రచ్చ రేపి హీరో విశాల్ అండ్ కో గత ఏడాది సెప్టెంబర్‌లో జరిగిన ఎన్నికల్లో గెలుపొందిన విషయం తెలిసిందే. కాగా ఓటమి పాలైన శరత్‌కుమార్ వర్గం సంఘ నిర్వాకంలో పలు అవకతవకలకు పాల్పడినట్లు అధికారం చేపట్టిన నూతన కార్యవర్గం తర్వాత కూడా ఆరోపణలు చేసింది.

సంఘ ట్రస్ట్ నిధికి సంబంధించి అక్రమాలు, సంఘం బిల్డింగ్ కోసం కేటాయించిన డబ్బును వాడుకున్నారంటూ ప్రధాన ట్రస్టీలుగా బాధ్యతలు నిర్వహించిన శరత్‌కుమార్, రాధారవి(రాధిక సోదరుడు)లను సంఘం నుంచి తాత్కాలికంగా సస్పెండ్ చేస్తున్నట్లు అప్పట్లో ప్రటించారు. ఈ విషయమై శరత్‌కుమార్ వర్గం కోర్టును కూడా ఆశ్రయించింది. అయితే కేసు విచారణలో ఉండగానే వారిద్దరినీ శాశ్వతంగా తొలగిస్తూ నడిగర్ సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది.

ఆదివారం స్థానిక టీనగర్, అబిబుల్లా రోడ్డులో గల సంఘ ఆవరణలో నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో మాజీ అధ్యక్షుడు శరత్‌కుమార్, మాజీ కార్యదర్శి రాధారవిలను సంఘం సభ్యత్వం నుంచి శ్వాశతంగా ఉద్వాసన పలుకుతూ తీర్మానం చేశారు. సర్వసభ్య సమావేశం పూర్తి చేసిన నిర్వాహకులు అనంతరం మీడియా సమావేశంలో శరత్‌కుమార్, రాధారవిల సభ్యత్వం నిరంతర రద్దును సమర్థించుకున్నారు.ఈ సందర్శంగా కోశాధికారి కార్తీ మాట్లాడుతూ గత నిర్వాకంలో సంఘ ట్రస్ట్‌కు తొమ్మింది మంది ట్రస్టీలు ఉండాల్సింది, శరత్‌కుమార్, రాధారవి మాత్రమే మొత్తం అధికారం ఉండేటట్లుగా వ్యవహరించి సంఘ నిధికి సంబంధించి పలు ఆక్రమాలకు పాల్పడట్టు లెక్కల్లో తేలిందని సీనియర్ నటుడు, నడిగర్ అధ్యక్షుడు నాజర్ ప్రకటించాడు. మరోపక్క కార్యదర్శి విశాల్ మాట్లాడుతూ... అవినీతిని చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించాడు.

సంఘం నుంచి తొలగించబడిన సభ్యులు, వ్యతిరేక వర్గం తమను సమావేశంలో పాల్గొనడానికి అనుమతి ఇవ్వాలంటూ సమావేవ వేదిక ముందు ఆందోళనకు దిగారు. కొందరు సంఘ సభ్యులు వారిని అడ్డుకునే ప్రయత్రంలో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగి పరిస్థితి ఉద్రిక్త వాతావరణానికి దారి తీసింది.ముష్టి యుద్ధాలకు దిగారు.పలువురికి గాయాలయ్యారుు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి ఇరువర్గాలకు సర్దిచెప్పే ప్రయత్నం చేసినా ప్రయోజనం లేక పోవడంతో లాఠిచార్జి చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఆందోళన కారులను అరెస్ట్ చేశారు. సమావేశం జరగనివ్వకుండా కొందరు కావాలనే ఆందోళనకు దిగారని వారిపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు కార్యదర్శి విశాల్ తెలిపగా, నడిగర్ సంఘం నుంచి శాశ్వతంగా రద్దు చేయడంపై రాధారవి స్పందిస్తూ నడిగర్ సంఘంలో మేము అన్నీ కరెక్ట్‌గానే చేశామని, సంఘం నుంచి తొలగించడంపై కోర్టులో తేల్చుకుంటామని తెలిపాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nadigar Sangam  Vishal  Saratkumar  Karthi  radharavi  

Other Articles