అఖిల్ రెండో లాంఛ్ డేట్ ఖరారు. టబు, రెహమాన్ లు నిజంగానే ఉన్నారా? | Akkineni Akhil second movie launch date announced.

Akhil second movie launch date

Akkineni Akhil, Akhil second Movie, Akhil Vikram Kumar, Akhil AR Rahaman, Akhil with Tabu, Akhil new Movie, Akhil next launch date

Akkineni Akhil second movie under Vikram Kumar direction, launch date announced.

రెండో మూవీ లాంఛ్ డేట్

Posted: 11/25/2016 03:21 PM IST
Akhil second movie launch date

అక్కినేని వారసుడిగా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చినప్పటికీ అఖిల్ తో హిట్ ను అందుకోలేకపోయాడు వివి వినాయక్ లాంటి స్టార్ దర్శకుడి చేతిలో పడ్డప్పటికీ, సూపర్ హీరో తరహా కథాకథనం అఖిల్ కు అస్సలు సూట్ కాలేదు. దీంతో రెండో చిత్రం కోసం ఆచీ తూచీ  కథలు ఎంపిక చేశాడు నాగ్. ఆ మధ్య కృష్ణగాడి వీరప్రేమ గాథ దర్శకుడు రాఘవ తో సినిమా అని అనౌన్స్ చేశారు. కానీ, చివరి నిమిషంలో దానిని నితిన్ కు షిప్ట్ చేసేశాడు.

చివరికి మనం దర్శకుడు విక్రమ్ కుమార్ చేతికి అఖిల్ రెండో సినిమా వెళ్లింది. ఇప్పటికే స్క్రిప్ట్ పనులన్నీ పూర్తి కాగా, ఎప్పుడు సెట్స్ మీదకు వెళ్తుందా అని అభిమానులంతా ఎదురు చూడసాగారు. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఆ ముహుర్తం రానే వచ్చిందని తెలుస్తోంది. డిసెంబర్ 12న ఈ చిత్ర షూటింగ్ ను లాంఛ్ చేయాలని అక్కినేని ఫ్యామిలీ డిసైడ్ అయ్యిందంట. ఈ మేరకు రెండు మూడు రోజుల్లో అఫీషియల్ అనౌన్స్ మెంట్ కూడా చేయబోతున్నారంట. అంటే ఎంగేజ్ మెంట్ అయిన మూడు రోజులకు అఖిల్ కొత్త సినిమా ప్రారంభం అవుతుందన్న మాట.

మరోవైపు సినిమాలో టబు ఓ కీలకపాత్ర(అఖిల్ తల్లి పాత్ర అని చెప్పుకుంటున్నారు) పోషిస్తుందని, ఏ ఆర్ రెహమాన్ మ్యూజిక్ అంటూ వార్తలు వస్తున్నాయి. అయితే అవి నిజమో కాదో అన్నది లాంఛింగ్ రోజే తెలిసే అవకాశం ఉందని, ఆ రోజే కాస్టింగ్ అనౌన్స్ మెంట్ చేస్తారని సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Akkineni Akhil  Vikram Kumar Movie  Launch date  

Other Articles

Today on Telugu Wishesh