స్టార్ హీరో. హీరోయిన్.. ఇద్దరికీ ఇది రెండో పెళ్లి | Dileep weds Kavya Madhavan; finally rumours come true.

Film stars kavya madhavan dileep get married

Kerala's Laila-Majnu, Kavya Madhavan, Dileep, Kavya Madhavan-Dileep, Kavya Madhavan, Dileep, Kavya Madhavan Dileep marriage

Kerala's Laila-Majnu, Kavya Madhavan-Dileep, get married.

రెండో పెళ్లి చేసుకున్న స్టార్ హీరోయిన్

Posted: 11/25/2016 02:55 PM IST
Film stars kavya madhavan dileep get married

సౌత్ లో ఇప్పుడు ఓ సెలబ్రిటీ జంట వివాహ వేడుక హాట్ టాపిక్ గా మారిపోయింది. మాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా వెలుగుతున్న కావ్యా మాధవన్, హీరో దిలీప్ శుక్రవారం ఉదయం కొచ్చిలోని ఓ హోటల్ లో వివాహం చేసుకున్నారు. కొంతమంది దగ్గరి బంధువులు, మిత్రుల సమక్షంలో వీరి వివాహం నిరాడంబరంగా సాగింది. మళయాళం చిత్ర పరిశ్రమలో లివింగ్ లైలా మజ్ను పేరుతో పిలుచుకునే ఈ జంట గత కొంతకాలంగా పీకల లోతు ప్రేమలో ఉన్నారు.

కాగా, ఇక్కడో విశేషం ఉందండోయ్. ఈ ఇద్దరు స్టార్లకు ఇది రెండో పెళ్లి కావటం విశేషం. దిలీప్ 1998లో హీరోయిన్ మంజూ వారియర్ ను పెళ్లి చేసుకుని ఆపై విడాకులు ఇవ్వగా, కెరీర్ జోరు మీదున్న సమయంలో 2009లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ నిశ్చల్ చంద్ర ను వివాహం చేసుకున్న కావ్య, ఏడాదిలోపే విడాకులు ఇచ్చింది. ఆపై వీరిద్దరూ వరుసగా సినిమాలు చేస్తూ ప్రేమలో మునిగిపోయారు. అయితే కావ్యా తో అఫైర్ తోనే దిలీప్ మంజు విడిపోయారన్న ఓ వాదన కూడా ఉంది.

గత కొంత కాలం వీరిద్దరు పెళ్లి చేసుకుంటున్నారని, అంతెందుకు అసలు చేసేసుకున్నారని కూడా కొన్ని వార్తలు చక్కర్లు. వాటన్నింటిని నిజం చేస్తూ ఈ ఉదయం వీరి వివాహం ఘనంగా జరిగింది. కాగా, ఈ పెళ్లికి దిలీప్ కుమార్తె సైతం అభ్యంతరం పెట్టలేదని తెలుస్తోంది. కావ్యా, దిలీప్ ల జోడీ ఇంతవరకూ 21 సినిమాల్లో కలిసి నటించగా, అందులో ఎన్నో సూపర్ హిట్స్ ఉన్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kavya Madhavan  Dileep  wedding  

Other Articles