గంటన్నర సినిమా.. సింగిల్ టేక్.. సోనీ కెమెరా.. రిలీజ్ కు రెడీ | Kandhaa was filmed in a single take

Kannada director creates record with single take movie

Kannada movie Kandhaa, Kandhaa Movie, Kandhaa director, Salman k george, Editor Salman k george, Single take Single Location movie

Kannada movie Kandhaa was filmed in a single take with five members in single location.

వర్మ రికార్డును చెరిపేసిన దర్శకుడు

Posted: 11/24/2016 01:00 PM IST
Kannada director creates record with single take movie

సినిమాల కోసం సిట్టింగ్ ల మీద సిట్టింగ్ లు వేసి రాస్తే, దాన్ని హీరోకి వినిపించడానికి ఓ ఆర్నెల్ల కాలయాపన, ఆపై షూటింగ్ వెరసి ఓ సినిమా కార్యరూపం దాల్చటానికి ఏడాది నుంచి ఏళ్లకు ఏళ్లు పడుతోంది. అదే సమయంలో నిర్మాతల చేత బడ్జెట్ కన్నీళ్లు కూడా పెట్టించడం దర్శకులు చేసే బోనస్ లు. అయితే వర్మ, అతని శిష్యుడు పూరీ మాత్రం అలా కాదు. బడ్జెట్ ఇష్యూ పక్కనబెడితే వారి సినిమాలు రోజుల నుంచి నెలల్లోనే కానిచ్చేస్తుంటారు.

వర్మ సినిమాలైతే మరీ ఘోరం. అసలు ఎప్పుడూ, ఎక్కడ షూటింగ్ అవుతాయో కూడా తెలీకుండా చాపలా చుట్టేసి, ఫస్ట్ లుక్ లు, టీజర్లంటూ షాకుల మీద షాకులు ఇస్తుంటాడు. కానీ, వీరిద్దరినీ మించిపోయే దర్శకుడు ఉన్నాడండోయ్. లెజెండరీ దర్శకుడు బాలచందర్ శిష్యుడు, ఎడిటింగ్ రంగంలో పదిహేనేళ్ల అనుభవం ఉన్న సాల్మన్ కే జార్జ్ డైరక్షన్ డెబ్యూ గా ఓ ప్రయోగాత్మక చిత్రం తీశాడు. అదే కందా(చిన్నారి అని అర్థం).

మొత్తం 92 నిమిషాల నిడివి ఉన్న ఈ చిత్రం సోనీ ఎఫ్ఎస్ 7 కెమెరాను వాడి జస్ట్ సింగిల్ లోకేషన్ లోనే చిత్రీకరించటం విశేషం. ఓ చిన్నపాప ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ హర్రర్ థ్రిల్లర్ కన్నడలోనే కాదు, సౌత్ లోనూ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిపోయింది. సినిమాకు ఇంకో బోనస్ ఏంటంటే.. సినిమాలో ఐదు పాత్రలే ఉన్నప్పటికీ, తెరపై ఏడు పాత్రలు ఉన్న భ్రమ కలుగుతుందంటం. అదెలాగో తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందేనంటున్నాడు సాల్మన్.

గతంలో దొంగల ముఠా సినిమా కోసం వర్మ ఇదే రీతిలో ఓ కెమెరాను వాడి కేవలం వారం లోపే సినిమాను కేవలం ఐదు రోజుల్లో, కేవలం ఎనిమిది మంది క్ర్యూ మెంబర్స్‌తో దిగ్విజయంగా పూర్తి చేయగా, ఇప్పుడు కందా కోసం కేవలం 5 గురితోనే కానిచ్చి రికార్డు క్రియేట్ చేశాడు. కాకపోతే సినిమా కోసం 25 రోజులు సభ్యులంతా రిహార్సల్స్ మాత్రం చేశారంట.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kannada  Kandhaa movie  Salman k george  Single take Single Location  

Other Articles