ధృవ, ఖైదీ అవన్నీ రూమర్లే అంటున్న చెర్రీ | Ram Charan gave clarity on Dhruva and Khaidi No 150

Dhruva non stop promotions starts

Dhruva, Dhruva Promotions, Dhruva Trailer, Dhruva Promotions Ram Charan, Ram Charan's Dhruva, Ram Charan Clarity, Dhruva New Trailer, Dhruva December 9th

Dhruva Promotions kick starts with theatrical trailer launch.

ధృవ కౌంట్ డౌన్ మొదలైంది

Posted: 11/24/2016 01:21 PM IST
Dhruva non stop promotions starts

ఎట్టకేలకు ధృవ సినిమాపై ఓ క్లారిటీ వచ్చేసింది. డిసెంబర్ 9న ఎట్టిపరిస్థితుల్లో రిలీజ్ అవుతుందని అల్రెడీ అనౌన్స్ చేసేసిన చెర్రీ, ఇప్పుడు ట్రైలర్ డేట్ కూడా చెప్పేశాడు. నవంబర్ 25 అంటే రేపు సాయంత్రం 7 గంటలకు ధృవ ట్రైలర్ రిలీజ్ కానుంది.

ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్లు మంచి రెస్సాన్స్ రావటం, హిప్ హప్ తమీజ్ అందించిన ఆల్బంకి అదిరిపోయే రెస్పాన్స్ రావటంతో ప్రమోషన్లపై దృష్టిసారించాడు చెర్రీ. అందుకు ట్రైలర్ రిలీజ్ అయ్యాక నుంచే ప్రమోషన్లు నాన్ స్టాప్ గా చేయాలని ఫ్లాన్ వేశాడు. ఈ క్రమంలో డాలర్ డ్రీమ్ తీర్చుకునేందుకు ఓవర్సీస్ లో కూడా పర్యటించి, ప్రమోషన్ లో పాల్గొనబోతున్నాడని తెలుస్తోంది. ఇంకోవైపు ఇక్కడ టీవీ చానెళ్లలో, ఎఫ్ఎంలలో కూడా ఇంటర్వ్యూలకు అల్రెడీ డేట్లు కూడా ఫిక్స్ చేసేశాడంట.

తమిళ హిట్ మూవీ తని ఒరువన్ కి రీమేక్ గా రాబోతున్న ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకుడు. రాంచరణ్ ఓ పవర్ ఫుల్ పోలీసాఫీసర్ పాత్రలో కనిపించబోతున్న విషయం తెలసిందే. మాతృకలో విలన్ పాత్ర పోషించిన అరవింద స్వామినే ఇక్కడా సేమ్ రోల్ పోషిస్తుండగా, రకుల్ హీరోయిన్ గా నటిస్తోంది. మొత్తానికి ప్రీ రిలీజ్ పంక్షన్ కంటే నుంచే ధృవ సందడిని చూడబోతున్నామన్న మాట.

రూమర్లు నమ్మకండి: చెర్రీ
తన సినిమా ధృవతోపాటు, ఖైదీ నంబర్ 150 చిత్రాలపై వస్తున్న రూమర్లను నమ్మద్దోంటూ రాంచరణ్ ఓ ప్రకటనలో తెలిపాడు. ప్రీ రిలీజ్ పంక్షన్ తోపాటు, ఖైదీ ఆడియో వేడుక, చీఫ్ గెస్టులు అంటూ వస్తున్నవేవీ నిజం కాదని, ఏదైనా ఉంటే తానే స్వయంగా అనౌన్స్ చేస్తానని చెర్రీ చెబుతున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ram Charan  Dhruva Release Date  Dhruva Trailer  

Other Articles