రెండో ఇన్సింగ్ ప్రారంభించనున్న రంభ rambha to begin second innings, back to business

Rambha to begin second innings back to business

rambha second innings, rambha as judge, rambha on second innings, Rambha, Zee Telugu, tollywood, dance show, judge, hyderabad

Yesteryear actress Rambha needs no introduction to Telugu people. She is to begin second innnings as judge for a dance show in popular zee telugu television

రెండో ఇన్సింగ్ ప్రారంభించనున్న రంభ

Posted: 11/18/2016 03:42 PM IST
Rambha to begin second innings back to business

వెండితెరపై తన నటనాభియనంతో మెప్పించి.. ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న అందాల అభినేత్రి రంభ.. చిందులేసి కురక్రారు కంటి మీద కునుకును కరువు చేసింది. అమె అందం అభినయానికి అబాలగోపాలం హుషారుతో చిందులేసిన విషయం తెలిపిందే. స్టెప్పుల్లో, స్పీడ్‌లో రంభ స్టైలే వేరు. హీరోయిున్‌గానే కాకుండా డ్యాన్స్ లోనూ కొత్త ఒరవడి సృష్టించిన రంభ... ఇప్పుడు తమ టాలెంట్‌ను నిరూపించుకోవాలనుకొనే వారికి వేదిక కాబోతున్న ‘ఏబీసీడీ’ ప్రోగ్రామ్‌కు న్యాయ నిర్ణేతగా వ్యవహరించనున్నట్లు జీ తెలుగు ప్రతినిధి ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

కాగా  అవకాశాలు తగ్గింతే చాలామంది నటీమణులు బుల్లితెరకు షిప్ట్ అవుతున్న విషయం తెలిసిందే. సీరియల్స్ లో నటించడంతో పాటు, డాన్స్ షోలకు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరిస్తున్నారు కూడా. 'జయం' చిత్రంలో తెలుగు తెరకు పరిచయం అయిన సదా...'ఢీ' జోడీ కార్యక్రమానికి జడ్జిగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.  పెళ్లి తర్వాత నటనకు దూరంగా ఉన్న రంభ తాజాగా  'ఏబీసీడీ' కి న్యాయ నిర్ణేతగా మారి బుల్లితెరపై తన రెండో ఇన్నింగ్స్ ను ప్రారంభించనుంది. మరి మళ్లి వెండితైరపైకి కూడా వస్తారేమో వేచి చూడాలి మరి..

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rambha  Zee Telugu  tollywood  dance show  judge  hyderabad  

Other Articles