సీక్రెట్ గా కలుసుకోవాల్సిన అవసరం ఏంటి? | Why rajani in Kamal Office.

Rajani meets kamal secretly

Rajanikanth, Kamal Hassan, Rajani Kamal meets, Kamal Hassan Office, Rajani in Kamal office, Kamal Hassan

Rajanikanth meets kamal Hassan Secretly.

రజనీ-కమల్ భేటీ ఎందుకసలు?

Posted: 11/16/2016 08:57 AM IST
Rajani meets kamal secretly

సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ రజనీ కాంత్, యూనివరల్స్ హీరో కమల్ హాసన్ లు ఇద్దరూ ఒకేసారి కెరీర్ ను ప్రారంభించారు. తమిళనాడుకు ఏ సమస్య వచ్చినా సరే ఈ కోలీవుడ్ పెద్దలే ప్రతీ విషయంలోనూ ముందుంటారు. అలాంటి ఆ ఇద్దరూ ఆకస్మాత్తుగా రహస్య భేటీ కావటంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

మంగళవారం సాయంత్రం ఆళ్వార్ పేట్ లోని కమల్ కార్యాలయంలో వీరిద్దరు సమావేశం అయ్యారని సమాచారం. రజనీ కాంత్ ఒక్కడే కమల్ ఆఫీస్ కు వెళ్లి, కమల్ తో ఏకాంతంగా సమావేశం అయ్యాడు. ప్రస్తుతం కోలీవుడ్ లో జరుగుతున్న వార్, కొత్త నోట్ల వ్యవహారం, సినిమాలు ఎదుర్కుంటున్న కష్టాలు తదితర అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది.

అయితే కేవలం వ్యక్తిగత పరామర్శల కోసమే వీరిద్దరు కలుసుకున్నట్లు సన్నిహితులు చెబుతున్నారు. అనారోగ్యంతో యూఎస్ వెళ్లి చికిత్స చేయించుకున్న రజనీ, కాలిగాయం నుంచి కోలుకున్న కమల్ ను కలిశాడని చెప్పుకుంటున్నారు. ఇక రజనీ ప్రస్తుతం రోబో 2.0 లో నటిస్తుండగా, కమల్ శభాష్ నాయుడు జెట్ స్పీడ్ తో షూటింగ్ జరుపుకుంటుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rajanikanth  Kamal hassan  meeting  

Other Articles