అ.. ఆ... పంక్షన్ లో డబుల్ మీనింగ్ డైలాగ్ నా తప్పే.. సారీ... | Srinivas Reddy apologized on A Aa sucessmeet Comments.

Srinivas reddy on a aa sucessmeet comments

Star Comedian, Srinivas Reddy, Hero Srinivas Reddy, Comedian Srinivas Reddy, Srinivas Reddy A.Aa.. speech, Srinivas Reddy comments, Srinivas Reddy on critics, Srinivas Reddy Jayammu Nischayammu Raa, Jayammu Nischayammu Raa telugu movie, Jayammu Nischayammu Raa interview, Srinivas Reddy interview Jayammu Nischayammu Raa, A.Aa... success meet

Srinivas Reddy confessed his speech at A Aa sucessmeet were improper.

వివాదాస్పద కామెంట్లపై తప్పు ఒప్పుకున్నాడు

Posted: 11/16/2016 10:24 AM IST
Srinivas reddy on a aa sucessmeet comments

దశాబ్దంన్నరకు పైగా టాలీవుడ్ లో కేవలం కమెడియన్ గానే కొనసాగాడు శ్రీనివాసరెడ్డి. మంచి టైమింగ్ ఉన్నప్పటికీ, స్టార్ కమెడియన్ల డామినేషన్, దానికితోడు అవకాశాలు అంతగా రాకపోవటంతో చానాళ్లు సైడ్ క్యారెక్టర్లతోనే సరిపెట్టుకున్నాడు. కానీ, గత కొంత కాలంగా అతని టైం నడుస్తోంది. కాస్త పాత్రా ప్రాధాన్యం ఉన్న చిత్రాలతోపాటు హీరో క్యారెక్టర్లు చేసే ఛాన్స్ దక్కించుకున్నాడు.

అయితే సాధారణంగా వివాదరహితుడిగా పేరున్న శ్రీనివాసరెడ్డి ఆ మధ్య చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. అ..ఆ.. సినిమా సక్సెస్ మీట్ లో రివ్యూల గురించి ప్రస్తావిస్తూ... సినిమాలో ఒకరిద్దరూ నటులు బాగా చేయలేదంటూ క్రిటిక్స్ రాశారు. కానీ, అదెవరో చెబితే బాగుండేది కదా అంటూ మాట్లాడాడు. రివ్యూలు రాసేవారు తీవ్ర ఒత్తిడిలో అలా చేశారేమో.. వారు స్ట్రెస్ బాల్స్(సినిమాలో సమంత చేతిలో ఉండే బంతి) వాడాల్సింది. ఒకవేళ అది కుదరకపోతే వాళ్లిష్టం ఉన్నట్లు ఆ బంతిని వాడుకోవచ్చంటూ వేదికపైనే వ్యంగ్యంగా మాట్లాడాడు.

అయితే శ్రీనివాసరెడ్డి మాత్రం తాను ఆరోజు అలా మాట్లాడాల్సి కాదని అంటున్నాడు. ఆ వ్యాఖ్యలు చేయటం ముమ్మాటికీ తప్పే. సినిమా బావున్నప్పటికీ, రివ్యూలు అలా రాయటంతో తట్టుకోలేకపోయాను. కానీ, కాస్త కంట్రోల్ లో ఉండాల్సింది అంటూ చెప్పుకొచ్చాడు. తాజాగా శ్రీనివాసరరెడ్డి హీరోగా నటించిన జయము నిశ్చయము రా చిత్రం విడుదలకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ఇంటర్వ్యూలు ఇస్తున్న శ్రీనివాసరెడ్డి ఈ సందర్భంగా ఆ టాపిక్ లేవనెత్తాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Jayammu Nischayammu Raa  Srinivas Reddy  A.Aa successmeet  Comments  

Other Articles