ఆ నటిది హత్యా? ఆత్మహత్యా? | Kollywood actress Sabarna Anand suspicious death.

Kollywood actress sabarna anand commits suicide

Sabarna Anand aka Suguna, Kollywood actress suicide, Kollywood actress suspicious death, Serial Actress Suicide, South Serial Actress, Serial Actress, Sabarna Anand, Actress Suguna

Popular film and television actor Sabarna Anand aka Suguna was found dead at her residence in Semmathamman Nagar, Chennai. She was 29.

నటి ఆత్మహత్యపై అనుమానాలు

Posted: 11/12/2016 12:13 PM IST
Kollywood actress sabarna anand commits suicide

ప్రముఖ సినీ నటి అనుమానాస్పద స్థితిలో మృతి చెందటం సౌత్ సినీ వర్గాలను షాక్ కి గురిచేసింది. 29 ఏళ్ల నటి సబర్న ఆనంద్ అలియాస్ సుగుణ మృతి శుక్రవారం వెలుగులోకి రావటంతో ఒక్కసారిగా కోలీవుడ్ ఉలిక్కిపడింది.

సెమ్మాతామ్మన్ నగర్ లో ఆమె ఉంటున్న అపార్ట్ మెంట్ నుంచి దుర్వాసన రావటంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. తలుపులు బద్ధలుకొట్టిన పోలీసులు లోపల గాయాలతో తీవ్ర రక్తస్రావంతో చనిపోయి, దేహం కుళ్లిపోయి ఉండటం గమనించారు. మూడు రోజులుగా ఆమె ఎవరికీ కనిపించటం లేదని చుట్టుపక్కల వారు చెప్పటంతో, మంగళవారం ఈ దారుణం జరిగి ఉండవచ్చని జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు.

అయితే వ్యక్తిగత సమస్యలు, ప్రేమ వ్యవహారం బెడిసి కొట్టడంతోనే చనిపోయినట్లు ఓ సూసైడ్ లేఖ దొరికినప్పటికీ, గాయాలు, మృతదేహం పడి ఉన్న తీరు పలు అనుమానాలకు తావినిస్తోంది. చెన్నై ఉడుంబలై పట్టైకు చెందిన సబర్న తల్లి పుష్పలత, తండ్రి ఆనంద్ కుమార్, సోదరుడు పక్కనే ఉన్న విరుగంబాక్కంలో నివాసం ఉంటుండంగా ఆమె ఒంటిరిగా ఓ స్టంట్ మాస్టర్ కి చెందిన ఫ్లాట్ లో ఉంటోంది.

ఒక మ్యూజిక్ ఛానల్ లో టీవీ వ్యాఖ్యాత, యాంకర్‌గా తన కెరీర్ ప్రారంభించిన సబర్న ఆ తర్వాత సినిమాలు, సీరియళ్లలో నటించారు. ముఖ్యంగా బుల్లితెర విలన్ గా సబర్నకు మంచి పేరు ఉంది. విశాల్-శృతీహాసన్ నటించిన పూజై(తెలుగులో పూజా), కుదిరసు, కలై లాంటి పలు చిత్రాల్లో ఆమె నటించారు. సబర్న ఆకస్మిక మృతితో తోటి కళాకారులు విషాదంలో మునిగిపోయారు. కిలిపాక ఆస్పత్రిలో ఆమె మృతదేహాం పోస్ట్ మార్టం చేస్తున్నారన్న వార్త తెలియగానే, మహిళా ఫ్యాన్స్ అక్కడ ఎగబడిపోతున్నారంటే సబర్న్ క్రేజ్ అర్థం చేసుకోవచ్చు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kollywood Actress  Sabarna Anand Aka Suguna  Death  

Other Articles