పవన్ లేట్ రెస్పాండ్.. మహేషే ముందు రియాక్ట్ అయ్యాడు | mahesh babu and pawan kalyan on currency ban

Mahesh babu pawan kalyan on currency ban

Pawan Kalyan, Pawan And Mahesh, mahesh Babu, Pawan and Mahesh, mahesh babu, Mahesh babu Modi, Pawan kalyan PM modi, narendra Modi Pawan Kalyan, pawan Kalyan narendra modi

After Mahesh Babu, Pawan Kalyan respond on PM Modi's Currency Decision.

పవన్ కన్నా మహేష్ ముందే రెస్పాండ్ అయ్యాడు

Posted: 11/11/2016 05:36 PM IST
Mahesh babu pawan kalyan on currency ban

సినిమాలు, అభిమానులను సంపాదించుకునే విషయంలో పోటాపోటీగా ఉండే ఈ ఇద్దరు టాలీవుడ్ అగ్రహీరోలు సామాజిక అంశాల్లో కూడా బాగానే స్పందిస్తుంటారు. పవన్, మహేష్ లు ఇద్దరూ సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ, ఒకరేమో ప్రత్యక్ష రాజకీయాల ద్వారా, మరోకరు వాటికి దూరంగా ఉంటూనే సేవా కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు.

ఇక పెద్ద నోట్లు రద్దు చేయాలన్న ప్రధాని నరేంద్రమోదీ నిర్ణయానికి దేశవ్యాప్తంగా మద్ధతు లభిస్తోంది. పలువురు సెలబ్రిటీలు సోషల్‌మీడియా ద్వారా ప్రధాని నిర్ణయాన్ని ప్రశంసిస్తున్నారు. ముఖ్యంగా మోదీ తీసుకున్న నిర్ణయంతో సినిమావాళ్లే భారీగా నష్టపోయే అవకాశాలుని అందరూ అనుకుంటున్నారు. కానీ, వాళ్లే మోదీని ప్రశంసిస్తున్న వారిలో ముందు వరసలో ఉన్నారు. మొన్న నిర్ణయం వెలువడగానే బాలీవుడ్ స్టార్లంతా స్పందించగా, కాస్త ఆలస్యమైనా ఈ ఇద్దరు టాలీవుడ్ హీరోలు ఇప్పుడు రియాక్ట్ అయ్యారు.

గత సాయంత్రం తన ట్విట్టర్ లో ‘దేశానికి, దేశ ఆర్థిక వ్యవస్థకు ఓ ఆహ్లాదకరమైన మార్పును తీసుకువచ్చారు. ప్రజల చేత, ప్రజల కొరకు ఎన్నుకోబడిన మోదీ మాస్టర్‌ స్ట్రోక్‌ ఇచ్చారు. సెల్యూట్‌ టూ మోదీజీ’ అని ట్వీటేశాడు మహేష్ బాబు. ఇక ఈరోజు గుత్తి గేట్స్ కాలేజీలో ఇంజనీరింగ్ విద్యార్థులతో భేటీ సందర్భంగా పెద్ద నోట్లను రద్దు చేయాలన్న నిర్ణయం చాలా మంచిదని పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ కూడా ప్రశంసించిన విషయం తెలిసిందే. మొత్తానికి బర్నింగ్ ఇష్యూ అయిన ఈ వ్యవహారంపై స్పందించటంతో అభిమానులు చాలా హ్యాపీగా ఫీలవుతున్నారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pawan kalyan  narendra modi  Mahesh babu  currency decision  

Other Articles