బూతు మెసేజ్ లతో చంపుతానని బెదిరించాడంట! | Shruthi Hassan death threats from a doctor.

Shruti haasan files complaint against bangalore doctor

Actress Shruthi Hassan, Shruthi Hassan death threat, Shruthi Hassan phone call, Shruthi Hassan threat call, Shruthi Hassan Doctor

Shruti Haasan Files Complaint Against Cyberstalking Doctor.

శృతీహాసన్ ను చంపుతానని బెదిరింపులు

Posted: 11/11/2016 12:21 PM IST
Shruti haasan files complaint against bangalore doctor

ఒంటరిగా ఉండేందుకు ఎక్కువగా ఇష్టపడే నటి శృతీహాసన్ కు వేధింపులు అధికం అయిపోతున్నాయి. గతంలో ఓ వ్యక్తి తాను అపార్ట్ మెంట్ లో ఉండగా దాడి చేశాడంటూ పోలీస్ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు మరో వ్యక్తి ఏకంగా శృతీని మర్డర్ చేస్తానంటూ హెచ్చరికలు జారీ చేశాడంట.

కర్ణాటకకు చెందిన ఓ వైద్యుడు చంపేస్తానని బెదిరిస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. కర్ణాటకకు చెందిన కేజీ గురుప్రసాద్ అనే వైద్యుడు సెప్టెంబర్ 7 నుంచి తన ట్విట్టర్ ఖాతాకు మెసేజ్ లు పెడుతూ, అసభ్యకరంగా తిడుతున్నాడని, చంపేస్తానని బెదిరిస్తున్నాడని తన ఏజెంట్ ప్రవీణ్ ఆంటోనీ ద్వారా చెన్నై సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఈ ఫిర్యాదుకు అతను చేసిన ట్వీట్లను స్క్రీన్ షాట్ తీసి జతచేసింది. కాగా, గతంలో ముంబైలోని తన అపార్ట్ మెంట్ లో ఉండగా, ఓ దుండగుడు దాడి చేశాడని ఆమె పోలీసులను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. హాట్ కామెంట్స్ తో బాలీవుడ్ లో ఇమేజ్ పెంచుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్న శ్రుతి హాసన్ 'బీ ద బిచ్' అనే షార్ట్ ఫిల్మ్ ను గత నెలలో విడుదల చేసిన సంగతి తెలిసిందే.

అయితే మాములుగా సెలబ్రిటీలకు ట్వీట్ల వేధింపులు వస్తున్నప్పటికీ, ఈ బోల్డ్ బ్యూటీకి ఇలా చావు బెదిరింపులు రావటంతో పోలీసులు కాస్త సీరియస్ గానే రియాక్ట్ అయ్యారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Actress Shruthi hassan  Bangalore Doctor  Threat Call  

Other Articles