హోటల్ రూం క్లీన్ చేసిన పవన్ కళ్యాణ్ | Pawan Kalyan Cleans Hotel Room

Pawan kalyan about charan chirpiness

Ram Charan, Pawan kalyan, power star about Mega Power Star, Pawan Kalyan Cleans Hotel Room, Ram Charan chirpiness, Pawan about Cherry chirpiness, Pawan Kalyan childhood

Ram Charan is the reason for Pawan Kalyan Cleans Hotel Room.

చరణ్ అల్లరి గురించి పవన్ నిజంగా చెప్పాడా?

Posted: 11/10/2016 01:25 PM IST
Pawan kalyan about charan chirpiness

మెగా పవర్ స్టార్ ఏకంగా పవర్ స్టార్ నే ముప్పుతిప్పలు పెట్టాడు. ఆ దెబ్బకి పవన్ చాలా కష్టపడ్డాడంట కూడా. ఇదంతా సినిమాల కోసం జరిగింది కాదులేండి. చిన్నతనంలో చెర్రీ అల్లరికి పవన్ బలైపోయాడంట. ఈ విషయాలను పవనే స్వయంగా ఓ ఈవెంట్ లో వెల్లడించాడని తెలుస్తోంది.

ఇంటర్మీడియట్ అయ్యాక సినిమాల్లోకి రాకముందు పవన్ చిరంజీవి ఇంట్లోనే ఉన్న విషయం చాలా మందికి తెలుసు. ఆ సమయంలో ఖాళీగా ఉన్న పవర్ స్టార్ చిరు వైఫ్ సురేఖకు ఇంటి పనుల్లో సాయం చేయటం, ఆ దంపతులు బయటికి వెళ్లినప్పుడు పిల్లలను చూసుకోవటం లాంటి పనులు చేసేవాడంట.  ఇలా ఓసారి చిరు సినిమా షూటింగ్ కోసం ఫ్యామిలీ అంతా సింగపూర్ వెళ్లిందంట.

అక్కడ చిరు, సురేఖ బయటికి వెళ్లటంతో పిల్లలను చూసుకుంటూ పవన్ హోటల్ లోనే ఉండిపోయాడంట. చరణ్ బాగా అల్లరి పిల్లవాడు కావటంతో చేతికందిన వస్తువులను విసిరేయటంతో రూమంతా చెండాలంగా తయారయ్యిందని, హోటల్ క్లీన్ చేసే వాళ్లు చూస్తే ఏమనుకుంటారో అన్న ఉద్దేశంతో తానే గదంతా శుభ్రం చేశానని పవన్ చెప్పుకోచ్చాడు. మొత్తానికి అబ్బాయి అల్లరిని గుర్తు చేసుకున్న బాబాయ్ ఆ అనుభవాలను గుర్తు చేసుకుంటూ తెగ మురిసిపోయాడని సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ram Charan  Pawan kalyan  power star  Mega Power Star  

Other Articles