పెళ్లి చూపులు హీరో సంచలనాలు కొనసాగిస్తాడా.? | will Vijay Devarakonda continues his success track

Shortfilm director for vijay devarakonda s next

Rahul Sankrityan for Vijay Devarakonda, Vijay Devarakonda and BBM producers Movie, Vijay Devarakonda next with star producers, Allu Aravind Vijay devarakonda, Shortfilm Director for Vijay Devarakonda, Short Film maker for Pelli Choopulu Hero

Short Film Director Rahul Sankrityan for Vijay Devarakonda and BBM producers Movie.

చిన్న హీరో.. పెద్ద నిర్మాతలు... కొత్త దర్శకుడు

Posted: 11/08/2016 12:29 PM IST
Shortfilm director for vijay devarakonda s next

పెళ్లి చూపులు సినిమాతో వన్ మూవీ సెన్సేషన్ గా మారిపోయిన విజయ్ దేవరకొండకి కాస్త లేటయిన మంచి కథలే వచ్చిపడుతున్నాయి. అల్రెడీ ద్వారకా రిలీజ్ కి రెడీ కాగా, అర్జున్ రెడ్డి లైన్ లో ఉంది. ఇదిలా ఉంటే  భలే భలే మగాడివోయ్ నిర్మాతలంతా కలిసి ఇతగాడితో ఓ సినిమా తీస్తామని అల్రెడీ ప్రకటన కూడా చేశారు. అయితే ఈ వార్త వచ్చి చాలా రోజులౌతున్నప్పటికీ, ఇప్పటిదాకా దాని గురించి ఎలాంటి న్యూస్ లేదు.

అయితే ఈ క్రేజీ ప్రాజెక్టు కోసం దర్శకుడి అన్వేషణ ముగిసినట్లు సమాచారం అందుతోంది. రాహుల్ సంకృత్యన్ అనే కొత్త దర్శకుడికి ఈ అవకాశం ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. మాటీవీ అప్పట్లో నిర్వహించిన షార్ట్ ఫిల్మ్ కంటెస్ట్ ద్వారా రాహుల్ సుపరిచితుడే. ఇప్పటికే నిర్మాతలైన అల్లు అరవింద్, యూవీ క్రియేషన్స్, మారుతిలను కలిసిన రాహుల్ చెప్పిన కథకు గ్రీన్ సిగ్నల్ కూడా లభించిందంట. డిసెంబర్ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. హీరోయిన్, తదితర కాస్టింగ్ అంతా ఆ సమయంలోనే అనౌన్స్ చేస్తారంట.

సాధారణంగా నిర్మాత అల్లు అరవింద్ సినిమాలకు మార్పులు, చేర్పులు ఖచ్చితంగా ఉంటుంటాయి. కానీ, ఈ షార్ట్ సినిమాల దర్శకుడు మాత్రం సింగిల్ ఛేంజ్ కూడా చేయించకుండా కథను ఓకే చేయించటం పై ఇప్పుడు అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి హీరోగా మొదటి సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసి టాప్ ప్రొడ్యూసర్లను రప్పించుకున్న విజయ్ కు, ద్వారకా గనక హిట్ అయితే ఆ క్యూ మరింత పెరిగిపోవటం ఖాయంగానే కనిపిస్తోంది.  

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Vijay Devarakonda  BBM Producers Movie  Rahul Sankrityan  Short Film Director  

Other Articles