F*ck అంటూ అఖిల్ పెళ్లి, కెరీర్ పై వర్మ ట్వీట్.. డిలేట్ | RGV tweet on Akhil Marriage and deleted

Rgv tweet on akhil marriage and deleted

RGV tweet on Akhil's marriage, Akhil marriage Varma Comment, Varma tweet on Akhil later Deleted, Varma F*ck tweet on Akhil, Akhil Ram Gopal Varma

Director Ram Gopal varma tweet on Akhil Marriage and later deleted.

అఖిల్ పెళ్లిపై ట్వీట్ చేసి.. తీసేసిన వర్మ

Posted: 11/08/2016 10:01 AM IST
Rgv tweet on akhil marriage and deleted

రాత్రి సంచలనాలకు నెలవైన ఆర్జీవీ తాజాగా మరో పోస్ట్ చేసి కలకలం రేపాడు. సాధారణంగా కొత్తవారిని ఎంకరేజ్ చేస్తూ ట్వీట్లు ట్వీటే వర్మ ఈసారి అక్కినేని నట వారసుడిని టార్గెట్ చేశాడు. అయితే ఈ క్రమంలో సలహా ఇచ్చే పేరుతో కాస్త బూతు పురాణం వల్లేశాడు. అక్కినేని అఖిల్ ఓ ప్రముఖ వ్యాపారవేత్త కూతురితో త్వరలో పెళ్లి చేసుకోబోతుంది తెలిసిందే కదా. దానిపై...

'బాబూ అఖిల్.. అసలు కెరియర్ అనేదే మొదలవ్వకముందే.. ఎందుకిలా పెళ్ళిలో మునిగిపోవాలని అనుకుంటున్నావ్? నేను అలాగే చేశాను కాబట్టి.. ఆమె జీవితాన్ని నువ్వు అస్తవ్యస్తం చేయవని అనుకుంటున్నా'' అంటూ ట్వీటేశాడు రామ్ గోపాల్ వర్మ. అయితే ఇంత మాంచి అఫీషియల్ బాషలో ఆయన రాయలేదులే. అందుకే నెటిజన్లు ఈ ట్వీట్లను చాలా సీరియస్ గా తీసుకుని తిట్టడం స్టార్ట్ చేశారు. వెంటనే రెస్పాండ్ అయిన వర్మ దానిని తొలగించిపడేశాడు.

Varma on Akhil marriage

అయితే మాములుగా ఇలాంటి వ్యవహారంలో అస్సలు వెనక్కి తగ్గని వర్మ అఖిల్ చేసుకోబోయేది గొప్పింటి అమ్మాయి కావటంతో ఒత్తిడి చేయించి మరీ ఆ ట్వీట్ డిలీట్ చేయించారంట. అప్పటికే మీడియాలో ఆ పోస్ట్ వైరల్ కావటంతో విషయం ఇప్పుడు చక్కర్లు కొడుతోంది. గతంలో అఖిల్ పోస్టర్ ను చూసి టాప్ హీరోలంతా పెట్టాబేడా సర్దుకోవాల్సిందేనని కామెంట్ చేసిన వర్మ, అఖిల్ వ్యక్తిగత పర్సనల్ పై కామెంట్ చేయటం ఆసక్తికరంగా మారింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ram Gopal Varma  Tweet  Akkineni Akhil's Marriage  Delete  

Other Articles