నరసింహంగా తోలు తీసి తుక్కురేగొట్టిన...| suriya Singham 3 teaser releaased

Suriya singam 3 teaser out

Suriya Roaring as Singham 3, Singam 3 Teaser released, Suriya's Singam-3 Teaser, Suriya Anushka And Shruthi Hassan, Suriya Singam-3

Suriya Singham 3 Official teaser released. Suriya Roaring with Complete Action Movie.

సూర్య సింగం-3 టీజర్ వచ్చేసింది

Posted: 11/08/2016 09:45 AM IST
Suriya singam 3 teaser out

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య సూపర్ హిట్ సిరీస్ సింగం మూడో పార్ట్ రాబోతుంది. ఇప్పటికే సింగం-3 ఫస్ట్ లుక్ దీపావళి కానుకగా రాగా, ఇప్పుడు ఏకంగా టీజర్ ను వదిలాడు సూర్య. 'ది ఇంటర్నేషనల్ కాప్' అంటూ ఎస్3 కి పెట్టిన ట్యాగ్ లైన్ కి న్యాయం చేస్తూ.. ఫుల్ ప్లెడ్జెడ్ యాక్షన్ మూవీని తెరకెక్కించినట్లు అర్థమౌతోంది. భారీ ఖర్చుతో యాక్షన్ సీక్వెన్స్ లను మూవీపై ఉన్న ఎక్స్ పెక్టేషన్స్ కు తగ్గట్లుగానే టీజర్ మొత్తాన్ని సూర్య వన్ మెన్ షో గా నడిపించాడు.

ప్రతీ ఫ్రేమ్ లోనూ గ్రాండియర్ కనిపిస్తుండగా.. విలన్స్ ను కాలితో నలిపేయడం.. షూట్ చేసేయడం.. ఇరక్కొట్టేయడం, తెలిసి తప్పు చేస్తే దేవుడినైనా వదిలేది లేదంటూ చెప్పే డైలాగులు లాంటి సీన్స్ నిమిషం వ్యవధి గల టీజర్ లోనే బోలెడన్ని ఉన్నాయి. అనుష్క ఒక ఫ్రేమ్ లోనే కనిపించినా క్యూట్ గా ఉంది. శృతి హాసన్ ను కూడా ఒకే ఫ్రేమ్ కి పరిమితం చేశారు.

 

సింగం సిరీస్ లోకి వచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ హారిస్ జైరాజ్ సినిమా థీమ్ కు గ్రాండ్ మ్యూజిక్ ఇచ్చినప్పటికీ, దేవీశ్రీప్రసాద్ తోనే వాయిస్ ఓవర్ ఇప్పించటం విశేషం. ఓవరాల్ గా ఈ మధ్య కోలీవుడ్ సరైన హిట్ లేని సూర్య కాస్త గ్యాప్ తో మళ్లీ పోలీస్ సింహంగా గర్జించి తన ఆకలి తీర్చుకునేలా ఉన్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Suriya  Singam-3  Teaser  released  

Other Articles