యండమూరి, బోయపాటి గొడవకు కారణం ఏంటి? | boyapati yandamuri clash at bethaludu audio launch

Boyapati yandamuri clash at bethaludu audio launch

Boyapati srinu and Yandamuri Veerendranath clash, Boyapati versus Yandamuri, Yandamuri Veerendranath versus Boyapati, Boyapati clash with writers, Star Director clash with directors, writers versus directors clash

boyapati strong counter to yandamuri at bethaludu audio launch.

యండమూరి వర్సెస్ బోయపాటి అసలేం జరిగింది?

Posted: 11/07/2016 01:23 PM IST
Boyapati yandamuri clash at bethaludu audio launch

ఒకరు స్టార్ రైటర్.. మరోకరు బిగ్ డైరక్టర్. ఇద్దరు వివాదాలకు కేరాఫ్ అడ్రస్సే. అలాంటిది ఒకే వేదికను పంచుకుంటే ఎలా ఉంటుంది. విజయ్ ఆంటోనీ అప్ కమింగ్ మూవీ భేతాళుడు ఆడియో పంక్షన్ లో సరిగ్గా ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్, స్టార్ దర్శకుడు బోయపాటి శ్రీను మధ్య ప్రత్యక్షంగానే మాటల యుద్ధం జరిగిందనే అనుకోవాలి.

అసలు దీనికి కారణం విజయ్ ను పొగుడుతూ యండమూరి చేసిన వ్యాఖ్యలే. ''1968లో నేను రాసిన మొదటి కథ భేతాళుడు. ఇప్పుడు అదే టైటిల్‌తో విజరు ఆంటోని సినిమా చేయడం ఆనందంగా ఉంది. విజయ్ ఆంటోని డా.సలీమ్‌ సినిమా చూసి తనకు నేను పెద్ద ఫ్యాన్‌ అయ్యాను. తను హాలీవుడ్‌ హీరో రాక్‌ హట్‌సన్‌లా ఉంటాడు. విజయ్ సెటిల్డ్‌ పెర్‌పార్మెన్స్‌ చేసే నటుడు. తెలుగులో ఇలా నటించే హీరోలు చాలా తక్కువగా ఉన్నారు. అంటూ పొగిడాడు.

వెంటనే మైక్ అందుకున్న బోయపాటి... ''సెటిల్డ్‌ పెర్‌ఫార్మ్‌ చేసే హీరోలు తెలుగులో చాలా తక్కువ మంది ఉన్నారని యండమూరి వీరేంద్రనాథ్‌ గారు అన్నారు. కానీ, తెలుగు హీరోలు కూడా సెటిల్డ్‌ పెర్‌ఫార్మెన్స్‌ చేస్తారు. అయితే దర్శకులు, రచయితలమైన మేం మారాలి. అవుటాఫ్‌ ది బాక్స్‌ కథలతో మనం వెళ్లినప్పుడు మన హీరోలు కూడా సెటిల్డ్‌ పెర్‌ఫార్మెన్స్‌తో అందరినీ ఆకట్టుకుంటారు. సినిమా అనేది స్టేజ్‌పై మాట్లాడకూడదు. స్క్రీన్‌పై మాట్లాడాలని నమ్మే వ్యక్తిని నేను’’ అంటూ కౌంటర్ ఇచ్చాడు.

ఇక్కడ దర్శకులది, హీరోలది ఏం తప్పులేదన్న బోయపాటి ప్రత్యక్షంగా రచయితలను తప్పుపట్టాడన్న మాట. ఆ మధ్య దేవీశ్రీప్రసాద్ తో, రీసెంట్ గా పోసాని, ఆ తర్వాత కొరటాల కూడా బోయపాటితో విభేధాలను బయటపెట్టిన సంగతి తెలిసిందే. ఇక యండమూరి దేవీశ్రీని పొగుడుతూ హీరో రాంచరణ్ పై సర్జరీ కామెంట్లు చేశాడు. ఇక ఈ ఇద్దరూ ఇప్పుడు ఒకరిపై ఒకరు ఇలా సెటైర్లు వేసుకుని మళ్లీ వార్తల్లో నిలిచారు. అయితే కేవలం హీరోయిజం మీదే డిఫెండ్ అయి సినిమాలు తీసే బోయపాటి వారిని వెనుకేసుకురావటంలో ఎలాంటి తప్పులేదు. ఈ నేపథ్యంలో రైటర్ల మీద బోయపాటి వేసిన పంచ్ ఆ ఇద్దరికీ(పోసాని, కొరటాల)కు కూడా తగిలినట్లే అని అనుకోవాలేమో!

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Boyapati Srinivas  Yandamuri Veerendranath  Bethaludu Audio launch  

Other Articles

Today on Telugu Wishesh