340 కోట్ల బడ్జెట్ వర్మ న్యూక్లియర్ మూవీ | RGV announces first international project 'NUCLEAR'

Rgv first international project announced

Ram Gopal Varma International Movie, RGV's Nuclear movie, Varma 340 crores budget movie, Ram Gopal Varma Nuclear Project, CMA Global Ram Gopal Varma, RGV first International Movie

Ram Gopal Varma's 'Nuclear' first International film costs 340 crores.

న్యూక్లియర్ బాంబు పేల్చిన వర్మ

Posted: 11/07/2016 12:39 PM IST
Rgv first international project announced

ఈసారి దర్శకుడు రాంగోపాల్ వర్మ ఇవ్వబోయే దెబ్బకి బ్రహ్మాండమే బద్ధలు కాబోతుంది. అవును... ఏకంగా న్యూక్లియర్ బాంబు మీదే వర్మ ఓ ఇంటర్నేషనల్ సినిమా తీయబోతున్నాడు. ఇందుకోసం అయ్యే బడ్జెట్ 340 కోట్లు. ఇదేదో వెతకారం అనుకునేరు. నిజంగానే నిజం.

సీఎంఏ గ్లోబల్ అనే ప్రతిష్టాత్మక సంస్థ వర్మతో ఈ ప్రయోగం చేసేందుకు ముందుకు వస్తున్నాయి. దేశం దేశాన్నే నాశనం చేయగల సత్తా న్యూక్లియర్ బాంబుది. ఒకవేళ టెర్రరిస్టుల చేతికి ఆ బాంబు వెళ్లి.. అది దుర్వినియోగం అయితే... మూడో ప్రపంచ యుద్ధం మొదలవుతుంది. ప్రపంచం నాశనమవుతుంది. అదే ఈ సినిమాలోని కథ’ అని వర్మ అంటున్నాడు.

అంతేకాదు టైటిల్ ను ఆవిష్కరిస్తూ ఓ పోస్టర్ ను కూడా వదిలాడు. ఓ హైవేపై ఎడ్ల బండి, సైకిల్ మీద వెళ్తున్న కుర్రాడు, దూరంగా అణు బాంబు పేలటం ఆ పోస్టర్ లో తన క్రియేటివిటీని చూపించాడు. న్యూక్లియర్-ద బిగినింగ్ ఆఫ్ వరల్డ్ వార్ 3 అనే ట్యాగ్ లైన్ తో సినిమా రానుంది. కశ్మీర్ వ్యవహారంలో అమెరికా ఇన్ వాల్వ్ కావటం, ఆపై ముంబైలో అణు బాంబు పడి మూడో ప్రపంచ యుద్ధానికి దారితీయటం, ఆపై  కోట్ల జీవితాలు ఎదుర్కున్న పరిస్థితులు టోటల్ గా ఇదే కథ అని వర్మ అనౌన్స్ చేశాడు కూడా.

అంతేకాదు ఈ చిత్రం తర్వాత ది డెడ్ ఆర్ ఎలైవ్ అనే భయానక చిత్రాన్ని, ది ట్యాబ్ లెట్ అనే మరో  సైన్స్ ఫిక్షన్ చిత్రాలను కూడా వర్మతోనే నిర్మించేందుకు సదరు సంస్థ సిద్ధమైపోయింది. ఇకపోతే న్యూక్లియర్ సినిమా కోసం అమెరికా, రష్యా, యమెన్, ఇండియా దేశాల్లో చిత్రీకరిస్తామని, ఇందులో ఇండియా, అమెరికా, చైనా, రష్యా నటులు నటిస్తారని వర్మ పేర్కొన్నాడు. బాహుబలి, రోబో 2.0 లే ఇప్పటిదాకా ఇండియాలో భారీ బడ్జెట్ సినిమాలు అని ఫీలవుతుంటే.. వర్మను నమ్మి 340 కోట్లు కుమ్మరించడటం అంటే మాటలు కాదు. అన్నట్లు స్టార్ల రెమ్యునరేషన్లు లేకుండా ఓన్లీ బడ్జెట్ మాత్రమే అంతనంట. సర్కార్ 3 తర్వాత దీనిని మొదలుపెట్టనున్నట్లు అల్రెడీ చెప్పేశాడు కూడా.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ram Gopal Varma  Nuclear Movie  340 Crores Budget  CMA global  

Other Articles