డీల్ తెగలేదు.. అందుకే డిలేట్ చేశాడంట! | sampoornesh babu delete Gali invitation pic

Sampoornesh babu delete gali invitation pic

Gali sampoo, Gali Janardhan Sampoo, sampoo Gali invitation, Gali Jaardhan pic with sampoornesh Babu, sampoo gali movie, sampoornesh kobbarimatta, sampoo kobbari matta,

sampoornesh babu post Gali Janardhan daughter invitation recieving pic, later deleted.

గాలి వార్తలతో సంపూ క్రేజ్ తగ్గిందా?

Posted: 11/03/2016 02:36 PM IST
Sampoornesh babu delete gali invitation pic

టాలీవుడ్ వన్ మూవీ వండర్ సెన్సేషన్ సంపూర్ణేష్ బాబు ఆ తర్వాత సినిమాల విషయంలో ఆ జోరు కొనసాగించలేకపోయాడు. రెండు సినిమాలు వచ్చినవి వచ్చినట్లే పోయాయి. అయితే సోషల్ మీడియాలో మాత్రం ఇతగాడి జర్నీ కొనసాగుతూనే ఉంది.

ఆట అవమానం-అనసూయ ఓదార్పు, పవన్ సభకు స్పందించి పెట్టిన ట్వీట్ కి ఆదరణ, ఏపీ ప్రభుత్వం పుష్కరాల స్పెషల్ ఇన్విటేషన్ అన్నీ అతగాడి క్రేజ్ నే అలా ఉంచేశాయి. ఇది చాలదన్నట్లు ఈ మధ్య మైనింగ్ టైకూన్ గాలి జనార్దన్ రెడ్డి కూతురి పెళ్లి ఇన్విటేషన్ స్వయంగా గాలినే అందించటం, ఆ ఫోటోను సంపూ తన అకౌంట్లో షేర్ చేశాడు. గాలి కుటుంబం తనపై చూపించిన ప్రేమకు బానిసను అంటూ హృదయకాలేయం డైలాగుతో కొట్టాడు. అయితే ఆ తర్వాత ఏం జరిగిందో తెలీదుగానీ, ఆ ఫోటో, మెసేజ్ రెండింటిని డిలేట్ చేశాడు.

Gali Janardhan special invitation to sampoo

గతంలో గాలి జనార్దన్ ని సంపూ ఓసారి మీట్ అయి ఫోటో దిగాడు అంతే. ఇక దానిని పట్టుకుని సినిమా ఫ్లాన్ చేశాడని, మొన్న కలిసినప్పుడు ఆ డిస్కషన్ రాగా, అది ఇప్పట్లో కుదరదని గాలి చెప్పాడని, అందుకు సంపూ హర్టయ్యి డిలేట్ చేశాడని... వివరణతో కొన్ని వార్తలు షికార్లు చేస్తున్నాయి. ఇంకా కొందరైతే ఫన్నీగా గాలి ఇల్లీగల్ మైనింగ్ లో సంపూ హస్తం ఉందని, వారి మద్య డీల్ చెడటంతోనే ఇలా విడిపోయారని జోకులు పేలుస్తున్నారు. ఏది ఏమైనా గాలి వార్తను పోస్ట్ చేసి ఓసారి, డిలేట్ చేసి మరోసారి ఇలా నానుతూనే ఉంది సంపూ నామస్మరణం. ఇక సినిమాల సంగతికొస్తే.. కాస్త డిలే అయినప్పటికీ ఈ డిసెంబర్ లో కొబ్బరిమట్ట వచ్చేయటం ఖాయంగానే కనిపిస్తోంది.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Gali Janardhan  Samppornesh Babu  invitation pic  deleted  

Other Articles