రెండో పెళ్లా? కీర్తిరెడ్డితో ఇప్పటికీ టచ్ లో ఉన్నా.. | Actor Sumanth still keep in touch with ex wife keerthy reddy.

No second marriage plan for akkineni sumanth

Sumanth still keep in touch with ex wife keerthy reddy, Sumanth about Keerthyreddy, Keerthy reddy second marriage, Keerthy reddy kids, Smanth about second marriage, Akkineni Sumanth about his personal life, sumanth Naruda DoNaruda

Akkineni Sumanth reactions on fans interaction in Fb about Ex wife keerthy reddy and second marriage.

రెండో పెళ్లి గురించి అక్కినేని హీరో

Posted: 11/03/2016 11:40 AM IST
No second marriage plan for akkineni sumanth

సెలబ్రిటీలు సాదారణంగా తమ వ్యక్తిగత జీవితాల్లో సంతోషమైన మూమెంట్లనే తప్ప, విషాదకరమైన విషయాలను పంచుకోవడానికి అస్సలు ఇష్టపడరు. ముఖ్యంగా వైవాహిక జీవితానికి సంబంధించి... అయితే అక్కినేని యంగ్ హీరో సుమంత్ మాత్రం ఈ విషయంలో చాలా మెచ్యూరిటినీ ప్రదర్శించాడు. తన పెళ్లి, విడాకులు తదితర విషయాల గురించి అభిమానులతో జంకు బెంకు లేకుండా అడిగిన వారికల్లా చెప్పుకోస్తున్నాడు.

రెండేళ్ల తర్వాత నరుడా.. డోనరుడా చిత్రం ద్వారా మన ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సుమంత్ గత రాత్రి ఫేస్ బుక్ లో అభిమానులతో లైవ్ ఛాట్ చేశాడు. ఈ సందర్భంగా అభిమానులు అడిగిన ప్రశ్నలన్నింటికీ చాలా ఓపిగ్గా, ఓపెన్ గా సమాధానాలిచ్చాడు. ఒక అభిమాని 'మీ మాజీ భార్య కీర్తి రెడ్డి గురించి చెప్పండి' అని అడుగగా.. తను, కీర్తి రెడ్డి ఇప్పటికే మంచి స్నేహితులమని.. ఇప్పుడు ఆమెకి పెళ్లి అయి బెంగుళూరు లో ఉంటుందని చెప్పాడు. ఆమెకి ఇప్పుడు ఇద్దరు లవ్లీ చిల్డ్రన్ ఉన్నారని చెప్పాడు. అప్పుడప్పుడు మాట్లాడుకుంటామని కూడా వివరించాడు. మరో అభిమాని 'విడాకుల తరువాత మళ్ళీ పెళ్లి చేసుకుంటారా?' అని అడుగగా.. 'నేను పెళ్లి చేసుకోవదలచు కోలేదు.. ఎవరి పెళ్లికైనా వెళతాను కానీ.. నేను పెళ్లి చేసుకోను' అని సమాధానం ఇచ్చాడు.

ఇక సినిమాల గురించి మాట్లాడుతూ... మంచి స్టోరీ దొరకక పోవడంతో ఇప్పటి దాకా ఆగానని చెప్పిన సుమంత్, వరుసగా మూడు సినిమాలు ప్లాప్ అవ్వడం.. తన ఫ్యామిలీ లో ప్రాబ్లమ్స్ రావడంతో కాస్త ఆలస్యంగా వస్తున్నానని, అందుకు సారీ అంటూ వివరించాడు. ఇక టాలీవుడ్ లో తన బెస్ట్ ఫ్రెండ్ మహేష్ అని చెబుతూ అవకాశం వస్తే సూపర్ స్టార్ కి విలన్ గా చేస్తానంటూ తన కోరికను బయటపెట్టాడు. ఏదేమైనా ఈ అక్కినేని వారసుడు రియాక్ట్ అయిన తీరును చూస్తే చాలా విశాల దృక్ఫథంతో ఉన్నాడని ఈజీగా అర్థమౌతోంది. కాదంటారా?

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Akkineni Sumanth  Naruda DoNaruda  Ex wife Keerthy Reddy  Second marriage  

Other Articles