ఎన్ని ఫస్ట్ లుక్ లంటూ కృష్ణవంశీపై చెర్రీ అసంతృప్తి | Ram Charan released Sai Dharam Tej First Look from Nakshatram

Sai dharam tej first look from nakshatram

Ram Charan released Sai Dharam Tej First Look, Ram Charan Nakshatram First Look, Sai Dharam Tej as Alexander, Sai Dharam Tej First Look from Nakshatram, Sai Dharam Tej cop look

Ram Charan released Sai Dharam Tej First Look motion poster from Nakshatram.

సుప్రీం హీరో కామెడీ కాదు సీరియస్

Posted: 10/21/2016 10:54 AM IST
Sai dharam tej first look from nakshatram

మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ రెండో సినిమా నుంచే సుప్రీం స్టార్ ట్యాగ్ లైన్ తగిలించుకుని వరుస సక్సెస్ లతో ముందుకు సాగుతున్నాడు. మాస్ లుక్ తో ఎక్కువ మంది అభిమానులను సంపాదించుకున్న సాయి ఇప్పుడు కృష్ణ వంశీ నక్షత్రం సినిమాలో ఓ స్పెషల్ క్యారెక్టర్ చేస్తున్నాడని తెలిసిందే. బర్త్ డే విషెస్ తో ఓ మాములు పోస్టర్ వదిలిన వంశీ, ఇప్పుడు సినిమాకు సంబంధించినఫస్ట్ లుక్ ను నిన్న సాయంత్రం మెగా పవర్ స్టార్ రాంచరణ్ తేజ్ విడుదల చేశాడు.

ఎన్ని ఫస్ట్ లుక్ లు వంశీగారూ అంటూ చెర్రీ సరదాగా డైలాగ్ చెప్పి ఆపై మోషన్ పోస్టర్ లాంచ్ చేశాడు. ఇందులో బ్లూ కలర్ డ్రెస్సు, చెవిలో బ్లూ టూత్, గన్ తో రఫ్ అండ్ టఫ్ ఫోజులో సాయి కనిపిస్తున్నాడు. మణిశర్మ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ అదిరిపోయిందంటే.  ప్రగ్నా జైస్వాల్ అతనికి జోడీగా నటిస్తోంది. సినిమాలో మెయిన్ లీడ్ సందీప్ కిషన్, రెజీనా అయినప్పటికీ, సాయి-ప్రగ్నా లుక్ లే అట్రాక్షన్ గా నిలుస్తున్నాయి. ఇందులో ఈ సుప్రీం హీరో అలెగ్జాండర్ అనే పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు. చివర్లో లుక్ ను ప్రశంసిస్తూ ఆల్ ది బెస్ట్ చెప్పేశాడు చరణ్.  

ఇప్పటిదాకా ఎంటరైటైనింగ్ పాత్రలలో కనిపించిన ఈ సుప్రీం హీరో ఫస్ట్ టైం ఫుల్ లెంగ్తీ సీరియస్ రోల్ లోనే కనిపించబోతున్నాడంట. అయితే కథను మలుపు తిప్పే ఈ పాత్ర ఇందులో కేవలం 30 నిమిషాలు మాత్రమే ఉండబోతుందని అల్రెడీ స్వయంగా తేజునే చెప్పేశాడు. సోలో హీరో నుంచి గెస్ట్ రోల్ చేయటం ఒక ఎత్తు అయితే, దాని ద్వారా సినిమాకు మరింత హైప్ పెంచటంలో బాగానే సక్సెస్ అవుతున్నాడు.  

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ram Charan  released  Sai Dharam Tej's Firstlook  Nakshatram motion poster  

Other Articles