ప్రకాశ్ రాజ్-రానాలు చేసింది ముమ్మాటికి తప్పే | Police complaint on Rana Prakash Raj for Gambling Ad

Complaint on rana prakash raj for gambling ad

Police Complaint Against Rana and Prakash Raj, Rana and Parkash Raj Ad, Gambling Ad trouble, Rana and Parkash Raj police complaint, police Complaint Rana, jungleerummy.com ad, Prakash Raj and Rana jungleerummy.com

Coimbatore Man Police Complaint Against Rana and Prakash Raj for promoting Gambling in Television through ad.

టాప్ యాక్టర్స్ యాడ్ పై వివాదం

Posted: 10/21/2016 11:26 AM IST
Complaint on rana prakash raj for gambling ad

చిన్న లొసుగు దొరికితే చాలూ ఏ అంశానైనా పెద్ద వివాదం చేసి పారేయొచ్చు. తద్వారా పాపులర్ అయిపోయి నిత్యం వార్తల్లో నిలవచ్చు. ఈ మధ్య ఇదో ట్రెండ్ గా మారిపోయింది. సెలబ్రిటీల విషయంలో అది చాలా ఈజీ వే. తాజాగా ఓ వ్యక్తి సౌత్ స్టార్లు ప్రకాశ్ రాజ్, రానా లపై పోలీస్ ఫిర్యాదు చేయటం చూస్తే ఇందుకోనేమో అనిపించకమానదు.

ఆ మధ్య ప్రకాశ్ రాజ్, రానాలు ఓ రమ్మీ యాడ్ లో కనిపించిన విషయం తెలిసిందే. కోయంబత్తూరు కు చెందిన ఎలంగోవన్ అనే ఉద్యమకారుడు ఈ యాడ్ పై పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశాడు. జంగ్లీరమ్మీ.కామ్ యాడ్ లో వారిద్దరు రమ్మీ ఆడాలంటూ ప్రజలకు ప్రచారం చేయటం ముమ్మాటికి తప్పని అందులో అతను పేర్కొన్నాడు. గాంబ్లింగ్ చట్ట విరుద్ధం. కానీ, దానిని ఖాతరు చేయకుండా వారు యాడ్ లో ప్రజలను ప్రొత్సహిస్తున్నారు.

సినిమా వాళ్ల ప్రభావం జనాల మీద ఖచ్ఛితంగా ఉంటుంది. ముఖ్యంగా బాహుబలి లాంటి సినిమా ద్వారా రానా బాగా పాపులర్. కాబట్టి వారిపై కేసు నమోదు చేయాల్సిందేనంటూ గొవన్ కోరుతున్నాడు. మంగళవారం ఫిర్యాదు అందగా, దానిని పరిశీలిస్తున్నామని. విచారణలో నిజనిజాలు నిర్ధారణ అయితే వారిపై కేసు నమోదు చేస్తామని అధికారులు చెబుతున్నారు. ఇందులో నిజంగా ఆయనకు సోషల్ రెస్పాన్స్ బులిటీ ఉంటే మాత్రం వివాదం చేయాల్సినంత సీన్ ఇందులో ఉందా అన్న ప్రశ్న కొంత మంది వేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rana  Prakash Raj  Gambling Ad  police Complaint  

Other Articles