ప్రకాశ్ రాజ్ కి కాస్త కూడా విశ్వాసం లేదు | prakash raj comments on tollywood audience

Prakash raj comments on tollywood audience

Prakash raj shocking comments on Tollywood Viewers, Tollywood Audience tasteless, Prakash raj comments on telugu audience, tollywood people tasteless, Prakash raj comments on Tollywood, Prakash raj frustration on Tollywood

prakash raj comments on tollywood audience says tasteless.

తెలుగు ప్రేక్షకులపై పిచ్చి ప్రేలాపనలు

Posted: 10/19/2016 11:20 AM IST
Prakash raj comments on tollywood audience

పేరుకు కన్నడ వ్యక్తి అయినప్పటికీ విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ పాపులర్ అయ్యింది మాత్రం కోలీవుడ్, టాలీవుడ్ తోనే. సొంత ఇండస్ట్రీలో అవకాశాలు ఇవ్వకుండా ఛీ పొమ్మన దశలో అక్కున చేర్చుకుని ఇంత పేరు, ప్రఖ్యాతులు అదనంగా అవార్డులను అందించాయి. అయితే నోటి దురుసు, వ్యక్తిగత ప్రవర్తన కారణంగా గత కొంతకాలంగా సినిమాల్లో రాజ్ కి అవకాశాలు చాలా వరకు తగ్గిపోయాయి. రావు రమేష్, జగపతి బాబు లాంటి వాళ్లు ఆ ప్లేస్ ను రీప్లేస్ ను చేయటంతో టాలీవుడ్ లో అతనితో పని లేకుండా పోయింది.

మరి ఇదంతా లోపల పెట్టుకున్నాడో ఏమో ఒకేసారి టాలీవుడ్ పై విషం చిమ్ముతున్నాడు. ఈ మధ్య సొంతంగా నటించి, నిర్మించి, దర్శకత్వం వహించిన మన వూరి రామాయణం సినిమా విడుదలైంది. సినిమాకి టాక్ బాగానే ఉన్నా ఎందుకనో ఆదరణ అంతంత మాత్రంగానే ఉంది. ఇంకోవైపు ప్రేమమ్ సినిమా బాగా పుంజుకోవటం, పోటీగా వచ్చిన అభినేత్రి, ఈడు గోల్డెహెలు అట్టర్ ఫ్లాపులు కావటంతో ఈ సినిమాను కూడా అందులో కలిపేశారు.

అయితే కన్నడలో మాత్రం ఈ సినిమాకు మంచి ఆదరణే లభిస్తుందట. దీంతో అక్కడ మీడియాలకు ప్రెస్ మీట్లు పెట్టి ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు ప్రకాశ్ రాజ్. ఈ క్రమంలోనే మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. తెలుగు ప్రేక్షకులకు అసలు టేస్టే లేదని, మంచి సినిమాలను ఆదరించరని కూతలు కూశాడు. కల్చర్ ను పెంపొందించాల్సిన బాధ్యత ఇప్పటి యూత్ పై ఉంది. కానీ, తెలుగు ప్రేక్షకులకు ఆ ఒపిక లేదు. మిగతా భాషలు చూడండి కోలీవుడ్, బెంగాలీ, మళయాళం, కన్నడ ప్రేక్షకులు ఓ ఢిఫరెంట్ టేస్ట్ ఉంటుంది అంటూ తెలిపాడు.

తెలుగు ప్రేక్షకులకు కావాల్సింది కేవలం కమర్షియల్ సినిమాలు అయితే చాలూ. వేరే ఇంకేం అవసరం లేదు అంటూ వ్యాఖ్యలు చేశాడు. అయ్యా ప్రకాశ్ రాజా! మాకు టేస్ట్ లేదా? అసలు నువ్వు ఈ స్టేజీ లో ఉన్నావంటే దానికి కారణం ఎవరు? మేం కాదా? చిన్న చిత్రాలను బ్లాక్ బస్టర్లు చేసిన ఘనత మాక్కుడా ఉంది. ఈ మధ్య వచ్చిన పెళ్లి చూపులు గురించి మీకు తెలీదు అనుకుంటా! ముందు మాపై ఫిర్యాదులు చేయటం మాని, కొత్త ఆలోచనలతో వచ్చేందుకు ట్రై చేయి, ఎందుకు ఆదరించరో ఆ తర్వాత చూడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Prakash raj  Tollywood  audience  tasteless  

Other Articles