ఇజం కోసం పూరీ ఇగో పక్కకు పెట్టాడంట! | kalyan Ram ISM censor completed

Kalyan ram ism censor completed

Kalyan Ram ISM censor completed, ISM movie censor report, ISM censor report, ISM Censor Talk, ISM U/A, Kalyan ram character in ISM movie, ISM movie release date, Kalyan Ram sacrifice for NTR

kalyan Ram ISM censor completed got U/A certificate.

ఇజం సెన్సార్ రిపోర్టులో ఏముంది?

Posted: 10/17/2016 06:22 PM IST
Kalyan ram ism censor completed

నంద‌మూరి క‌ళ్యాణ్‌రామ్ ను కొత్త కోణంలో చూపిస్తూ పూరి జ‌గ‌న్నాథ్ డైరక్షన్ లో తెర‌కెక్కుతున్న ఇజం. ముందుగా ఈనెల 20నే రిలీజ్ చేద్దామనుకున్నారు. అయితే తమ్ముడు ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ అర్థ శత వేడుకలకు ఆటంకం కలగకూడదన్న ఉద్దేశంతో ఓ రోజు ముందుకు జరిపాడు. సెన్సార్ పూర్తయిన ఈ సినిమా యూ బై ఏ సర్టిఫికెట్ తో ఈ నెల 21న ప్రపంచ‌వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వ‌స్తోంది. కళ్యాణ్ రామ్ సొంత బ్యానర్ లో భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కింది ఇజం.

ఇక సెన్సార్ రిపోర్ట్ ప్రకారం సినిమా స్టోరీ, హైలెట్స్ ఇండ‌స్ట్రీలో సినిమాకు పాజిటివ్ టాక్‌ను పెంచుతున్నాయి. మొత్తం మూవీ జ‌ర్నలిజం బ్యాగ్రౌండ్‌తో సాగుతుంద‌ట‌. క‌ళ్యాణ్ రామ్ ప‌వ‌ర్ ఫుల్‌  ఇన్వెస్టిగేషన్ జ‌ర్నలిస్టుగా ఈజ్ తో నటించాడని తెలుస్తోంది. ప‌నామా లీక్స్‌, వికీ లీక్స్ వంటి సంచలనాల తరహాలో దేశాన్ని కుదిపేస్తున్న బ్లాక్ మ‌నీ వ్యవ‌హారాన్ని, తెలుగు రాష్ట్రాల బ‌డా బాబుల అవినీతి హిస్టరీని బయటపెట్టే రోల్ లో అడ్వెంచర్ లు చేస్తూ అదరగొట్టాడంట. అదే సమయంలో తన మార్క్ డైలాగులను ఎక్కడా మిస్ కాకుండా పూరీ చాలా జాగ్రత్తలు తీసుకున్నాడని టాక్.

అలాగే గతంలో టెంపర్ తరహాలో 5-7నిమిషాల లెంగ్త్ ఉన్న కోర్ట్ సీన్ సినిమాకే హైలైట్ అవుతుంద‌ట‌. ఈ సీన్‌లోనూ పేలిపోయే డైలాగులను అందించాడంట. ఓవరాల్ గా ఇజం క‌ళ్యాణ్‌రామ్ కేరీర్‌ కే పెద్ద మైలు రాయిగా నిలుస్తుందని చెప్పుకుంటున్నారు. చూద్దాం ఇజం ఏమేర ఆకట్టుకుంటుందో మరీ!

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kalyan Ram  ISM Movie  U/A  

Other Articles