ఆ హాలీవుడ్ సినిమాలో దీపికనే మెయిన్ హీరోయిన్ | xXx Return of Xander Cage Deepika's special trailer

Xxx return of xander cage deepika s special trailer

Deepika Padukone is on fire in ‘xXx: Return of Xander Cage’, Deepika special trailer xXx: Return of Xander Cage, Deepika on action in xXx: Return of Xander Cage

Deepika Padukone is on fire in ‘xXx: Return of Xander Cage’ new trailer

పీకూ కోసమే కొత్తగా రిలీజ్ చేశారా?

Posted: 10/17/2016 03:22 PM IST
Xxx return of xander cage deepika s special trailer

బాలీవుడ్ లో పీకూ, బాజీరావ్ మస్తానీ లాంటి రెండు బ్యాక్ టూ బ్యాక్ హిట్ చిత్రాలతో అవార్డులు సైతం కొల్లగొట్టిన సొట్టబుగ్గల దీపిక ఆపై హాలీవుడ్ కు చెక్కేసింది. ప్రస్తుతం విన్ డీజిల్ తో ట్రిపుల్ ఎక్స్ : ఎగ్జాండర్ కేజ్ డెబ్యూకి సిద్ధమైపోయిన దీపూ ఎప్పటికప్పుడు అందులోని లుక్ లతో చంపేస్తోంది. అయితే ఆ మధ్య రిలీజైన ట్రైలర్ లో ఆమెకు సంబంధించి కేవలం ఆరు ఫ్రేమ్ లను మాత్రమే చూపించారు. దీంతో అసలు ఇందులో కేవలం నామ మాత్రపు పాత్రేనని అంతా అనుకున్నారు.

కానీ, ఆ అంచనాలను పటాపంచల్ చేస్తూ మరో ట్రైలర్ ను రిలీజ్ చేసింది ట్రిపుల్ ఎక్స్ టీం. పూర్తిగా యాక్షన్ పార్ట్ తో నిండిపోయిన ఈ ట్రైలర్ లో ఇప్పటిదాకా వచ్చిన హాలీవుడ్  యాక్షన్ హీరోయిన్లకు ఏ మాత్రం తగ్గని రీతిలో రెచ్చిపోయింది. డీజిల్ తో రొమాన్స్ ట్రాక్ కూడా ఉన్నట్లు ఉంది గానీ, అదంతా సస్పెన్స్ గానే చూపించారు. రెండు మూడు డైలాగులను కూడా రివీల్ చేయటంతో  సినిమాలో ఆమె లీడ్ అన్న విషయాన్ని ధృవీకరించినట్లయ్యింది.

అయితే సినిమాలో కేవలం ఇండియా వర్షన్ కోసమే దీనిని రిలీజ్ చేయటం, మరికొందరు స్టార్ హీరోయిన్లు ఉండటంతో పీకూయే లీడ్ కాకపోవచ్చన్న వాదన వినిపిస్తోంది. ఏది ఏమైనా ఇప్పటిదాకా చూపించినదానికంటే, హాలీవుడ్ లో మరో మెట్టు ఎక్కిందన్నది మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. మరి సెరీనా ఉంగర్ రోల్ లో దీపికకు అంత సీన్ ఉందో లేదో తెలియాలంటే జనవరి దాకా ఆగాల్సిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Deepika Padukone  xXx: Return of Xander Cage  New Trailer  

Other Articles