పవన్ జోడీగా నయనతార ఆ రీమేక్ కోసం... | Nayanatara first time for Pawan

Nayanatara opposite pawan for vedalam remake

Pawan Vedalam Remake, Pawan Kalyan Nayanatara, Nayanatara Powerstar

Pawan kalyan finalised Nayanatara for Vedalam remake.

పవర్ స్టార్ సరసన ఆమె తొలిసారిగా...

Posted: 10/12/2016 10:25 PM IST
Nayanatara opposite pawan for vedalam remake

టాలీవుడ్ లో ఇప్పుడున్న యంగ్ హీరోయిన్లతో జోడీకట్టిన పవర్ స్టార్ అనుష్క, నయనతార లాంటి సీనియర్లతో మాత్రం ఇంకా వరకు యాక్ట్ చేయలేదు. అయితే త్వరలో వీరిద్దరిలో ఒకరితో పవన్ నటించబోతున్నాడనే వార్త ఇప్పుడు ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతుంది. అజిత్ కథానాయకుడిగా తమిళంలో రూపొందిన 'వేదాళమ్' సినిమా అక్కడ ఘనవిజయాన్ని సాధించింది. ఈ సినిమాను తెలుగులో పవన్ కథానాయకుడిగా ఎ.ఎం.రత్నం నిర్మించనున్నట్టు కొంతకాలంగా వార్తలు షికారు చేస్తున్నాయి. ఈ వార్తను నిజం చేస్తూ దసరా సందర్భంగా ఈ సినిమా లాంచ్ అయిన విషయం తెలిసిందే. తమిళ దర్శకుడు నేసన్ ఈ సినిమాను తెరకెక్కించనున్నాడు.

ప్రస్తుతం అందుకు అవసరమైన సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమాలో కథానాయికగా నయనతారను ఎంపిక చేసుకోవాలనే ఉద్దేశంతో ఆమెను సంప్రదించారట. ఈ సినిమా కథ నచ్చడంతో వెంటనే ఆమె ఓకే చెప్పేసిందని అంటున్నారు. కథ ప్రకారం మరో యువ కథానాయికను కూడా అన్వేషిస్తున్నారట. ఆ ఛాన్స్ ఎవరికి దక్కుతుందో చూడాలి.

సిస్టర్ సెంటిమెంట్ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ చిత్రంలో పవర్ స్టార్ డాన్ క్యారెక్టర్ లో కాసేపు కనిపించనున్నాడు. మాతృకలో వరలక్ష్మీ మీనన్ అజిత్ సిస్టర్ రోల్ లో కనిపించింది. మరి తెలుగులో ఆ రోల్ ఎవరితో చేయిస్తారో చూడాలి. డిసెంబర్ నుంచే త్రివిక్రమ్ సినిమాతోపాటు దీనిని ఒకేసారి సెట్స్ మీదకు తీసుకెళ్లి వచ్చే యేడు దీపావళికి చిత్రం ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pawan Kalyyan  Nayanatara  Vedalam remake  

Other Articles