శాతకర్ణిలో అసలు సత్తాలేదు అయినా... | Balayya Satakarni teaser not impressive

Balayya satakarni teaser not impressive

Balayya, GSP teaser, Balayya Gautamiputra Satakarni teaser

Krish play strategy Balayya Satakarni teaser not impressive.

క్రిష్ సేఫ్ గేమ్ ఇక్కడి నుంచే...

Posted: 10/12/2016 10:36 PM IST
Balayya satakarni teaser not impressive

బాలకృష్ణ 100వ చిత్రంగా 'గౌతమీపుత్ర శాతకర్ణి' చిత్రం తెరకెక్కుతోంది. క్రిష్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా నుంచి నిన్ననే టీజర్ వచ్చింది. దసరా పండుగ సందర్భంగా వదిలిన ఈ టీజర్ అందరిచేత వన్స్ మోర్ అనిపిస్తోంది. యూ ట్యూబ్ లో వదిలిన ఈ టీజర్ 24 గంటలలోనే మిలియన్ (పది లక్షలు) వ్యూస్ ను సాధించింది. అయితే అసలు అంతగా అందులో ఏముందన్న వాదన ఇప్పడు వినిపిస్తోంది.

యుద్ధ సన్నివేశాలపై .. బాలయ్య డైలాగ్ పై కట్ చేసిన ఈ టీజర్ కి గంట గంటకి హిట్స్ పెరిగిపోతున్నాయి. అసలు మ్యాటర్ ఏం రివీల్ చేయకుండా క్రిష్ సేఫ్ గేమ్ ఆడాడు. కేవలం చిన్న డైలాగ్ ఉన్న టీజర్ మాత్రమే వదిలి పెద్ద సస్పెన్స్ నే క్రియేట్ చేశాడు. ''మా కత్తి కంటిన నెత్తుటి చార ఇంకా పచ్చిగానే వుంది .. సమయం లేదు మిత్రమా .. శరణమా .. రణమా'' అని బాలకృష్ణ చెప్పిన పవర్ఫుల్ డైలాగ్ యూత్ ను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

 

ఈ టీజర్ తో ఈ సినిమాపై ఒక రేంజ్ లో అంచనాలు పెరిగే ఛాన్స్ ఉందని అనుకుంటున్నారు. బాలయ్య కెరీర్ లోనే తొలిసారి 60 కోట్లకు పైగా బిజినెస్ చేసిన ఈ చిత్రం సంక్రాంతికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Balayya  GSP teaser  

Other Articles