ఇజం వేడుకల్లో ఎన్టీఆర్, గర్ల్ ఫ్రెండ్ తో హడావుడి | ISM audio launch event highlights

Ntr speech at ism audio launch

Kalyan Ram ISM movie audio launched, Kalyan Ram ISM movie audio launch, NTR speech at ISM Audio, Hari Krishna speech at ISM audio Launch, Puri speech at ISM audio launch, Kalyan Ram speech at ISM audio, Prakash Raj speech at ISM audio launch, aditi Arya speech at ISM audio

Kalyan Ram ISM movie audio launched. Puri Jagannath Direction. Nandamuri Harikrishna and NTR chief guests.

పూరీ చేతిలో పడ్డామంటే ఇక ఫినిష్

Posted: 10/06/2016 10:07 AM IST
Ntr speech at ism audio launch

హీరోయిజాన్ని సింగిల్ డైలాగ్ తో ఎలివేట్ చేసే సత్తా ఉన్న టాలీవుడ్ డైరక్టర్ పూరి జగన్నాథ్. కళ్యాణ్ రామ్ లాంటి మాస్ ఫాలోయింగ్ ఉన్న హీరోని 8 ప్యాక్ తోనే కాదు, టోటల్ గా స్టైల్ పరంగానే లుక్ మార్చేసి ఇజం తో మన ముందుకు తీసుకోస్తున్నాడు. ఈ చిత్ర ఆడియో పంక్షన్ నిన్న హైదరాబాద్ లో జరిగింది. గెస్టులుగా తండ్రి హరికృష్ణతోపాటు, సోదరుడు జూనియర్ ఎన్టీఆర్, ప్రకాశ్ రాజ్ తదితరులు హాజరయ్యారు.

జగన్ గారితో మన సినిమా కన్ఫామ్ అయిపోయిందని అన్నకు చెప్పింది నేనే’ అని యంగ్ టైగర్ ఎన్టీఆర్ అన్నాడు. ఈ చిత్రం ఓకే అవగానే తన అన్న కల్యాణ్ రామ్ కు ఆ విషయం మొదట చెప్పింది తానేనని చెప్పాడు. అయితే, ఈలోగా, జూనియర్ ఎన్టీఆర్ చేతిలోని మైక్ ను లాక్కున్న కల్యాణ్ రామ్ మాట్లాడుతూ, ‘ఆ న్యూస్ నాకు కరెక్టుగా ఫిబ్రవరి 4, 11.30 గంటలకు తను ఫోన్ చేసి చెప్పాడు. ఐ నెవర్ ఫర్ గెట్ దట్’ అన్నాడు. అనంతరం, జూనియర్ ఎన్టీఆర్ తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ, ‘దర్శకుడు జగన్ గారితో కల్యాణ్ అన్న కలిసి పని చేయాలని నేను ఎప్పటి నుంచో అనుకునేవాడిని. ''నా కెరియర్ అనేది.. టెంపర్ సినిమాకు ముందు.. టెంపర్ తరువాత అంటూ మార్చేశాడు పూరి జగన్ భయ్యా. ఆ సినిమా చేసిన తరువాత నాలో చాలా మార్పు వచ్చేసింది. ప్రతీ విషయాన్ని డిఫరెంట్ గా చూడటం నేర్చుకున్నాను. అందుకే నాకు పూరి భయ్యా అంటే చాలా ఇష్టం.

ఇక, మా అన్న గురించి మాట్లాడాలంటే.. ఎక్కడ ప్రారంభించాలో తెలియదు.. నాకు అన్నీ అతనే. ఒక నటుడిగా ఈ సినిమా కోసం అన్న చాలా కష్టపడ్డాడు.''ఆన్నే నాకు సర్వస్వం. ఆయనే ఫ్రెండ్. తను నా వెల్ విషర్.. కొన్నిసార్లు నా గాళ్ ఫ్రెండ్ కూడా'' అని చెబుతూ అందరినీ నవ్వుల్లో ముంచెత్తాడు జూనియర్ ఎన్టీఆర్. సాధారణంగా ఎప్పుడూ కళ్యాణ్ రామ్ గారు అంటూ మాట్లాడే ఎన్టీఆర్.. ఇప్పుడు మాత్రం అన్న అంటూ క్లోజ్ గా పిలుస్తుంటే మతిపోయింది అందరికీ. గతంలో కేవలం అప్పుడప్పుడే అన్న అనే ఎన్టీఆర్.. ఇప్పుడు ఎందుకో తనలోని రియల్ ఫీలింగ్స్ అన్నీ బయటపెట్టేశాడు.  ఏ విషయంలోనైనా కష్టపడితే ఆ ఫలితం విజయం రూపంలో మనకు దక్కుతుంది. ఈ చిత్రం ద్వారా అన్న విజయం సాధించాలి’ అని జూనియర్ ఎన్టీఆర్ కోరుకున్నాడు.

''నా వయస్సు 59 నుండి 60 ఏళ్ళకు వస్తున్నప్పుడు.. నా బిడ్డ టెంపర్ సినిమా ఇచ్చాడు. అదే సంవత్సరంలో పటాస్ ఇచ్చాడు మరో బిడ్డ. ఇక 60లోకి వచ్చాక జూనియర్ వచ్చి.. జనతా గ్యారేజ్ మీకు గిఫ్టు ఇస్తున్నాను అన్నాడు. ఇప్పుడు పెద్ద బిడ్డ కూడా ప్రజల ఆశిస్సులతో ఇజం ద్వారా హిట్టుకొట్టబోతున్నాడు'' అని హరికృష్ణ చెప్పడంతో అభిమానులు ఉర్రూతలూగిపోయారు. ఇక పూరీ గురించి ప్రస్తావిస్తూ... ఏంటయ్యా నా కొడుకును ఇలా మార్చవని అడిగిన ఘటనను గుర్తు చేసుకోవటంతో అంతా నవ్వుల్లో మునిగిపోయారు.

ప్రకాశ్ రాజ్ అయితే పూరితోపాటు నందమూరి బ్రదర్స్ ఇద్దరినీ పొగడ్తలతో ముంచెత్తాడు. డక్ అనేది ఓ బూతు. కానీ, దాని కూడా అందంగా మలచడంలో పూరి స్టైలే వేరు. అందుకే సినిమాలకు, అతని వ్యక్తిత్వానికి ఏ మాత్రం సంబంధం ఉండదు. మాస్ సినిమాలకు రియల్ కేరాఫ్ అడ్రస్ మాత్రం పూరియే అని తెలిపాడు. ఇక ఎన్టీఆర్ నాలాంటి వాళ్లకు ఇష్టమైన నటుడు. అతని సోదరుడిగా కళ్యాణ్ రామ్ కూడా విజయం సాధించాలి అంటూ తనస్టైల్లో విషెస్ చెప్పేశాడు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kalyan Ram  ISM movie  Audio Launch  Puri Jagannath  

Other Articles